సారంగాపూర్, సెప్టెంబర్ 1: ప్రభుత్వం అమలుచేస్తున్న ఆసరా పథకంతో నిరుపేదల బతుకులకు భరోసా లభిస్తున్నదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్డర్ సంజయ్‌కుమార్ అన్నారు. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షే మ పథకాలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తున్నదని చెప్పారు. గురువారం ఆయన మండలంలోని రేకులపల్లి, తాళ్లధర్మారం, చిత్రవేణిగూడెం, కమ్మునూర్, మంగె ళ, కండ్లపల్లి, చర్లపల్లి, రంగసాగర్ గ్రామాల్లో పర్యటించారు. కొత్తగా పింఛన్లు మంజూరైన వారికి మంజూరుపత్రాలు, ఐడీ కార్డులు, లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు
ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ, అర్హులందరికీ పింఛన్లు వస్తాయని, ఏ ఒక్కరూ ఆందోళన చెందవద్దని సూచించారు. బీర్పూర్ మండలంలోని 70ఏళ్ల రోళ్లవాగు ప్రాజెక్ట్ పనులు వానల వల్ల పనులకు అంతరాయం కలిగిందని, త్వరలోనే పూర్తిచేస్తామని చెప్పారు. కార్యక్రమా ల్లో ఎంపీపీ మసర్తి రమేశ్, జడ్పీటీసీ పాత పద్మారమేశ్, వైస్‌ఎంపీపీ బల్మూరి లక్ష్మణ్రా వు, కేడీసీసీబీ డైరెక్టర్ ముప్పాల రాంచందర్‌రావు, విండో చైర్మెన్ నవీన్‌రావు, పార్టీ ప్రధాన కార్యదర్శి శీలం రమేశ్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌రావు, ఆర్బీఎస్ జిల్లాసభ్యుడు కొల్ముల రమణ, మండల కన్వీనర్ మెరుగు రాజేశం, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు నల్లమైపాల్రెడ్డి, యూత్ మండలాధ్యక్షుడు గాజర్ల రాంచంద్రంగౌడ్, నేతలు ఉన్నారు.