కార్పొరేషన్, ఆగస్టు 27: హైదరాబాద్‌లోని నివాసంలో ఎమ్మెల్సీ కవితను టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు-వర్ష దంపతులు, తెలంగాణ జాగృతి నాయకుడు తిరుపతిరావు, తదితరులు శనివారం మర్యాదపూర్వకంగా కలిసి సంఘీభావం తెలిపారు. ఎమ్మెల్సీ ఇంటిపై బీజేపీ నాయకుల దాడిని ఖండించారు.
ముకరంపుర, ఆగస్టు 27: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితను టీఆర్వీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కేవీ జాన్సన్, కార్యదర్శి కోడూరి ప్రకాశ్ ఆధ్వర్యంలో నాయకులు హైదరాబాద్‌లోని నివాసంలో కలిసి సంఘీభావం తెలిపారు. ఎమ్మెల్సీ ఇంటిపై బీజేపీ నాయకులు చేసిన దాడిని ఖండించారు. ఈ సందర్భంగా తమ అపరిష్కృత సమస్యలతో పాటు విద్యుత్ ఉద్యోగుల పీఆర్సీ, ఇతర సమస్యలను నాయకులు ఎమ్మెల్సీకి వివరించగా సీఎం కేసీఆర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ట్రాన్స్‌కో-జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ఇక్కడ సంఘం రాష్ట్ర సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్, జెన్కో కార్యదర్శి చారుగుండ్ల రమేశ్, ట్రాన్స్‌కో కంపెనీ కార్యదర్శి పీ రాములు, ఎస్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షుడు ఎండీ యూసుఫ్, కార్యదర్శి కరెంట్‌రావు, నాయకులు నిరంజన్, శ్రీధర్‌గౌడ్, నరేందర్పాల్, చుక్కా గిరి, అబ్బాస్, సతీశ్, శ్రీనివాస్, పండరిరెడ్డి, విశాల్, హరీశ్, సంజీవ్‌రెడ్డి, మోసిన్, తదితరులు పాల్గొన్నారు.
కొత్తపల్లి, ఆగస్టు 27: ఎమ్మెల్సీ కవితను కొత్తపల్లి పట్టణానికి చెందిన మహిళా నాయకురాలు రుద్ర రాధ మర్యాదపూర్వకంగా కలిసి సంఘీభావం ప్రకటించారు. ఎమ్మెల్సీ ఇంటిపై బీజేపీ శ్రేణుల దాడులను ఆమె తీవ్రంగా ఖండించారు.