గంభీరావుపేట, ఆగస్టు 27: ‘గంభీరావుపేట లో నిర్మించిన కేజీ టూ పీజీ విద్యాసంస్థల సముదాయం అద్భుతంగా ఉన్నది.. ఈ ప్రాంగణం రాష్ర్టానికే రోల్ మోడల్‌గా నిలుస్తున్నది’ అంటూ టీఎస్ ఎడ్యుకేషన్ వెల్పేర్ డెవలప్మెంట్ చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డి ప్రశంసించారు. శనివారం ఆయ న కేజీ టూ పీజీ విద్యాలయాన్ని సందర్శించారు. ఇక్కడి సౌకర్యాలు, నిర్మించిన భవనాలను చూసి ఆశ్చర్యపోయారు. అద్భుతంగా నిర్మించారని అభినందించారు. ఈసందర్భంగా గివ్ తెలంగాణ ఫౌండేషన్ ప్రతినిధి కొండూరి సంకేత్రావు సముదాయంలో ఏర్పాటు చేసిన తరగతి గదులు, క్రీడా మైదానం, గ్రంథాలయం తదితర నిర్మాణాలపై ఆ యనకు వివరించారు. ఒకేప్రాంగణంలోకేజీ నుంచి పీజీ వరకు అన్ని విద్యాలయాలతోపాటు అంతర్జాతీయస్థాయి క్రీడామైదానం, భోజనశాల, శిక్షణ కేం ద్రం గొప్పగా నిర్మించారని కితాబిచ్చారు. ఆయన వెంట టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాపాగారి వెంకటస్వామిగౌడ్, విద్యాకమిటీ చైర్మన్ గంధ్యాడపు రాజు, ఆయాశాఖల అధికారులు ఉన్నారు.