బోయినపల్లి, ఆగస్టు 26: రైతుల సమస్యలపై అధ్యయనం చేయాలని, క్షేత్రస్థాయిలో రై తులతో సమావేశమై వారి అనుభవాలు, సమస్యలను తెలుసుకొని వాటిపై అవగాహ పెం పొందించుకోవాలని అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ సూచించా రు. ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం జగిత్యాల పొలాస కాలేజీ విద్యార్థులు క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా శుక్రవారం నర్సింగాపూర్ వచ్చారు.
ఈ సందర్భంగా వినోద్‌కుమార్‌ను కలువగా ఆయన వారితో మాట్లాడారు. వ్యవసాయ రంగంలో ఉన్న సమస్యలకు పరిష్కార మా ర్గాలు కనుగొనాలని వారికి సూచించారు. ఒక్కొ క్క విద్యార్థి ఒక్కొక్క రైతును కలిసి వారి అనుభవాలు, సమస్యలను విని పరిష్కార మార్గాలను కనుక్కోవాలని సూచించారు. ఫీల్డ్లెవల్లో అనుసరించాల్సిన విధానాన్ని, రైతుల కష్టాలపై కూడా అధ్యయనం చేయాలని కోరారు. కాలానుగుణమైన పంటలు, రైతులు అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలపై సమగ్రంగా అధ్యయనం చేయాలని చెప్పారు. అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు భవాని, అఖిల, నిహారిక, లయ, దీప్తి, మైనా, ప్రియా తదితరులున్నారు.