వేములవాడ, ఆగస్టు 26: ప్రజలకు సత్వర న్యాయం అందించాలనే సంకల్పంతోనే కోర్టుల పరిధి పెంచుతున్నామని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయన్ స్పష్టం చేశారు. వేములవాడ కోర్టు భవనంలో సీనియర్ సివిల్ కోర్టు సేవలను ఆయన శుక్రవారం వర్చువల్ విధానంలో ప్రారంభించి మాట్లాడారు. వేములవాడ ఎంతో విశిష్టత గల పుణ్యక్షేత్రమన్నారు. ఇక్కడ కోర్టు సేవలు ఎంతో అవసరమని చెప్పారు. పట్టణానికి త్వరలోనే వచ్చి శ్రీ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకుంటానని తెలిపారు.
జూనియర్ సివిల్ కోర్టు పరిధిలో ఉన్న రూ.20 లక్షల వాల్యుయేషన్‌ను రూ.10 లక్షలకు తగ్గించాలనే యోచన ఉందని, ఇందుకు ప్రతిపాదనలు కూడా వెళ్లాయన్నారు. హైకోర్టు పోర్టుపోలియో న్యాయమూర్తి సంతోష్‌రెడ్డి మాట్లాడుతూ.. వేములవాడ గొప్ప పుణ్యక్షేత్రమని, ఇక్కడ కోర్టు సేవలు ప్రారంభించడం శుభసూచికమన్నారు. సీనియర్ సివిల్ కోర్టు ద్వారా కక్షిదారులకు, న్యాయవాదులకు సేవలు మరింత చేరాయని చెప్పారు. అనంతరం కోర్టును జిల్లా న్యాయమూర్తి ప్రేమలత ప్రారంభించారు.
కార్యక్రమంలో సీనియర్ సివిల్ న్యాయమూర్తులు రవీందర్, శ్రీలేఖ, జూనియర్ సివిల్ న్యాయమూర్తులు ప్రతీక్సిహాగ్, సౌజన్య, బార్ కౌన్సిల్ సీనియర్ సభ్యుడు లక్ష్మణ్‌కుమార్, డీఎస్పీ నాగేంద్రచారి, ఏపీపీ విక్రాంత్, ఏజీపీ సదానందం, వేములవాడ, సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు వేముల సుధాకర్‌రెడ్డి, వసంతం, ఉపాధ్యక్షుడు గడ్డం సత్యనారాయణరెడ్డి, న్యాయవాదులు నాగుల సత్యనారాయణ, నేరెళ్ల తిరుమల్‌గౌడ్, అనిల్‌కుమార్, కొడిమ్యాల పురుషోత్తం, అయిల్నేని కిశోర్‌రావు, గుండ రవి, సంటి సుజీవన్, పిట్టల మనోహర్, నాగుల సంపత్, కాతుబండ నర్సింగరావు, జంగం అంజయ్య, అవదూత రజనీకాంత్, పిట్టల భూమేశ్, నక్క దివాకర్, బొడ్డు ప్రశాంత్, పారువెళ్ల శ్రీనివాస్, పంపరి శంకర్ పాల్గొన్నారు.