గణపతి నవరాత్రుల్లో మట్టి గణపతులను ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణకు దోహదపడుదాం. సీఎం కేసీఆర్ గొప్ప సంకల్పంతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ద్వారా లక్షలాది మట్టి విగ్రహాలను ఐదు నెలల నుంచి తయారు చేయించారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వానికి నివేదించి 10 వేల మట్టి విగ్రహాలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసినం. ప్రతి మండలంలో ఎంపీపీలు, ఎంపీటీసీలు వీటిని అందిస్తారు. మట్టి విగ్రహాలను పెట్టి నీటి కాలుష్యాన్ని నివారించాలి.
– రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్
కార్పొరేషన్, ఆగస్టు 26 : నవరాత్రుల్లో మట్టి గణపతులను ప్రతిష్ఠించి పూజలు చేస్తూ పర్యావరణ రక్షణకు దోహదపడాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ అన్నారు. ఈ నెల 31న వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పర్యావరణాన్ని రక్షించాలనే ఆలోచనతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం లో 10 వేల మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమానికి శుక్రవారం ఆయన శ్రీకారం చుట్టారు. స్థాని క ప్రతిమ మల్టీఫ్లెక్స్‌లో ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి, నగర మేయర్ యాదగిరి సునీల్‌రావుతో కలిసి మట్టి విగ్రహాల పంపిణీ పోస్టర్ ఆవిష్కరించి విగ్రహాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పర్యావరణాన్ని రక్షించాలనే గొప్ప సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ శాఖ ద్వారా లక్షలాది మట్టి వినాయక విగ్రహాలను ఐదు నెలల నుంచి తయారు చేయించినట్లు చెప్పారు. ప్లాస్టిక్ నివారణ చర్యలో భాగంగా మకజొన్నతో త యారు చేసిన స్టార్చ్ బ్యాగులను వాడాలన్నారు. గణేశ్ నవరాత్రి వేడుకల్లో జిల్లా ప్రజలు మట్టి వి గ్రహాలను నెలకొల్పి చవితి వేడుకలను ఆనందం గా జరుపుకోవాలని కోరారు. వినాయకుడు నగ ర ప్రజల సకల విజ్ఞాలను తొలగించి ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలను ప్రసాదించాలని అర్థించారు.
కరీంనగర్ పార్లమెంట్ ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో తాను సొంతంగా ప్రభుత్వాని కి నివేదించి 10 వేల మట్టి వినాయక విగ్రహాల ను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పార్లమెంట్ పరిధిలో ప్రతి మండలంలోని ఎంపీటీసీలు, ఎం పీపీలు, పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో విగ్రహాలను ప్రజలకు అందిస్తామని చెప్పారు. మట్టి విగ్రహాలను పెట్టి నీటి కాలుష్యాన్ని నివారించాలని ప్ర భుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ప్రజలను అవగాహన పరుస్తున్నదన్నారు.
ప్రతి ఒకరికీ ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఇరిగేషన్ మాజీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వర్ రావు, కార్పొరేటర్లు బండారి వేణు, వాల రమణారావు, కంసాల శ్రీనివాస్, ఐలేందర్ యాద వ్, గుగ్గిళ్ల జయశ్రీ, గందె మాధవి, గంట కళ్యాణి శ్రీనివాస్, బుచ్చిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పొన్నం అనిల్ కుమార్ గౌడ్, జకుల నాగరాజు, సంపత్, సాయి, ఆనంద్ పాల్గొన్నారు.