కలెక్టరేట్, ఆగస్టు 22: ‘బిల్కిస్ బానో కేసు లో దోషులను విడుదల చేయడం దారుణం.. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలి’ అని కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ మైనార్టీ విభాగం నా యకులు గుజరాత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. ఈ విషయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారికి పోస్ట్ద్వారా వినతిపత్రాలు పం పించారు. మైనార్టీ విభాగం నాయకులు సోమవారం కరీంనగర్లో మౌన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మైనార్టీ నేత జమిలొద్దీన్ మాట్లాడారు. బీజేపీ పాలనలో మైనార్టీ మహిళలకు రక్షణ కరువైంద ని ఆందోళన వ్యక్తం చేశారు. దోషులందరూ బీజేపీకి అనుకూలురు కావడంతోనే విడుదల చేశార ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆజాదీకా అమృత్ ఉత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో గుజరాత్ సర్కారు నిబంధనలకు విరుద్ధంగా క్షమాభిక్షను ప్రసాదించడం దారుణమన్నారు. ఈ వి షయంలో కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలను తుంగలో తొక్కడం బాధాకరమన్నారు. దోషుల ను తిరిగి అదుపులోకి తీసుకొని బతికున్నంత కాలం జైలుకే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. ఎండీ మాజిద్, అప్సర్, బియ్యాబానీ, అంకుషావళి, ఎండీ అమీన్ షరీఫ్, అక్బర్ హు స్సేన్, జావేద్, మహ్మద్ ఖాలీద్ పాల్గొన్నారు.