సిరిసిల్ల/సిరిసిల్ల టౌన్, ఆగస్టు 22 : రాజన్న సిరిసిల్ల జిల్లా దవాఖానలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ) ప్రారంభమై ఐదేళ్లు పూర్తయ్యాయి. ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత కార్పొరేట్‌కు దీటుగా వైద్యసేవలు విజయవంతంగా అం దుతుండగా, దవాఖాన పనితీరు వైద్యుల అంకితభావం, నిబద్దతకు నిదర్శనమని మంత్రి కేటీఆర్ అభినందించారు. ఐసీయూ సేవలు ప్రారంభమై సోమవారం నాటికి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి సందేశాన్ని పంపారు.
అందుబాటులోకి అత్యవసర సేవలు
సిరిసిల్ల ప్రభుత్వ దవాఖానలో మొట్టమొదటి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ను 2017 ఆగస్టు 22న మంత్రి కేటీఆర్‌తో కలిసి అప్పటి వైద్య, ఆరో గ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఐసీ యూ ప్రారంభానికి ముందు నిరుపేదలకు ఏదైనా అత్యవసర ఆరోగ్య సమస్యలు, పాముకాటు, పాయిజనింగ్, పక్షవాతం, మూర్చ, గుండెపోటు వంటి సమస్యలకు వెంటిలేటర్ అవసరమైనపుడు దూరప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. దూర ప్రాం తాలకు వెళ్లే క్రమంలో మార్గం మధ్యలోనే ప్రాణా పాయం సంభవించేది. దాని నివారణకు మంత్రి కేటీఆర్ సిరిసిల్ల దవాఖానలో ఐసీయూ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడమే కాకుండా, మంజూరు చేయించి త్వరితగతిన పూర్తి చేయిం చారు. ఈ ఐసీయూ ద్వారా గడిచిన ఐదేళ్లలో సు మారు నాలుగువేల మందికి చికిత్స అందించారు. దాదాపు 3300 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్చ్ అయ్యారు. మరి కొందరిని వివిధ కార ణాలతో పైదవాఖానలకు రెఫర్ చేశారు. డెత్ రేట్, అతి తక్కువ రెఫరల్ రేట్, బెడ్‌పైన రోగి ఉన్న రోజులు అనే మూడు అంశాలపై ఐసీయూ పనితీరును చూస్తే స్టాండర్డ్ ఇంటెన్సివ్ కేర్ యూ నిట్స్ కన్నా చాలా తక్కువ అనగా 0.5 శాతం ఉంది. రెఫరల్ రేట్ ఒక్క శాతం కన్నా తక్కువగా ఉంది. కార్పొరేట్ దవాఖానల ఐసీయూ కన్నా సిరిసిల్లా జిల్లా దవాఖాన బెటర్ పెర్ఫార్మెన్స్ ప్రదర్శించింది.
వైద్యుల నిబద్ధతకు నిదర్శనం
రాజన్న సిరిసిల్ల జిల్లా దవాఖానలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ పనితీరు వైద్యుల అంకిత భావానికి నిదర్శనం. ఐదేళ్లలోనే కార్పొరేట్ దవాఖానల ఐసీయూలకు దీటుగా జిల్లా ప్రభుత్వ దవాఖాన ఐసీయూను తీర్చిదిద్దడం అభినందనీయం. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో పేద ప్రజలకు ఖరీదైన ఐసీయూ సేవలు మరింత చేరువ చేయాలి.
– మ్ంరత్రి కేటీఆర్