వేములవాడ, ఆగస్టు 21: సంక్షేమ ఫలాలు అందరికీ అందే విధంగా కృషి చేస్తానని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు అన్నారు. స్వా తంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా వేములవాడ క్రి స్టియన్ అసోసియేషన్ ఆధర్యంలో ఆదివారం ఫ్రీ డం వాక్ నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని ఎమ్మె ల్యే ప్రారంభించి, మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలు, మతాల ప్రజలకు సంక్షేమఫలాలు అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు నీరటి సువర్ణ-మల్లేశం, వేములవాడ ఫాస్టర్ల సం ఘం అధ్యక్షుడు జోసెఫ్ పాల్, అహరోన్, ఏసుపాల్, ప్రసంగి, తిమోతీ, రాజు, ప్రకాశ్, జాను, వేణుపాల్, మోజెస్, క్రీసుదాసు తదితరులు ఉన్నారు.