ఇల్లందకుంట, జనవరి 10: సీఎం కేసీఆర్ రైతులకు అండగా నిలిచారని, దేశంలోనే ఎక్కడా లేని పథకాలు అమలు చేస్తూ వారి అభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నారని జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, ఎంపీపీ పావని పేర్కొన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద సోమవారం ఏవో గుర్రం రజిత ఆధ్వర్యంలో రైతుబంధు సంబురాలు నిర్వహించారు. కార్యక్రమానికి వారు హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికే రైతు బంధు పథకం ప్రవేశపెట్టిందన్నారు. పంటల సాగు కోసం అప్పు చేయాల్సిన అవసరం లేకుండా ప్రతి సీజన్ ప్రారంభంలోనే పెట్టుబడి సాయం అందిస్తున్నదని కొనియాడారు. మండలంలోని సీతంపేట గ్రామానికి చెందిన రఫీ, ఇల్లందకుంటకు చెందిన మధుసూదన్ ఉత్తమ రైతులుగా ఎంపిక కాగా, వారిని సన్మానించి బహుమతులను అందజేశారు. సంబురాల్లో భాగంగా మహిళలు వేసిన ముగ్గులు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఏడీఏ దామోదర్‌రెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ కందాల కొమురెల్లి, ఎంపీటీసీలు సంజీవరెడ్డి, ఓదెలు, విజయ్‌కుమార్, మాజీ ఎంపీటీసీ పెద్దికుమార్, నాయకులు వెంకటేశ్, సమ్మిరెడ్డి, విక్రమ్, మహేందర్, ఏపీఎం రమాదేవి, ఏఈవోలు సంపత్, మహేందర్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.
సైదాపూర్‌లో..
రైతును రాజును చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని లస్మన్నపల్లి సర్పంచ్ కాయిత రాములు పేర్కొన్నారు. మండలంలోని లస్మన్నపల్లి గ్రామంలో సోమవారం రైతుబంధు సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా రైతులు రైతుబంధు ప్రాధాన్యాన్ని తెలిపే ముగ్గులు వేశారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ, దేశంలో ఎక్కడాలేని విధంగా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ ప్రభుత్వానిదేనని కొనియాడారు. కార్యక్రమంలో ఏఈవో రజిత, పంచాయతీ కార్యదర్శి శ్రీలక్ష్మి, వార్డుసభ్యులు, రైతుబంధు సమితి ప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
వీణవంకలో..
మండల కేంద్రంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మావురపు విజయభాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం రైతుబంధు సంబురాలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం రూపొందించిన రైతుబంధు కరపత్రాలను మండల కేంద్రంలోని రైతువేదికలో ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, అభిమానాన్ని చాటుకున్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో రైతుబంధు ఉత్సవాలను పురస్కరించుకొని మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. రైతులకు అన్ని విధాలా అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్‌కు మండల రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బాలకిషన్‌రావు, వైస్ ఎంపీపీ రాయిశెట్టి లత, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు ఎక్కటి రఘుపాల్‌రెడ్డి, కో ఆప్షన్ మెంబర్ హమీద్, పీఏసీఎస్ డైరెక్టర్లు కామిడి శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, రాములు, గెల్లు మల్లయ్య, మాజీ జడ్పీటీసీలు ప్రభాకర్, శ్రీదేవి, ఎంపీటీసీ నాగిడి సంజీవరెడ్డి, ఏవో గణేశ్, ఏఈవోలు అచ్యుత్, రాకేశ్, సంగీత, నాయకులు మాడ సాధవరెడ్డి, తిరుపతిరెడ్డి, శ్రీనివాస్, రవి, కొండల్‌రెడ్డి, వీరారెడ్డి, ప్రభాకర్, వంశీ, రాజేశం తదితరులు పాల్గొన్నారు.