జగిత్యాల, ఆగస్టు 20: దళితుల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు దేశానికే దిక్సూచీగా నిలుస్తున్నదని, కుటుంబాలకు బతుకుబాట చూపుతూ వెలుగులు నింపుతున్నదని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేర్కొన్నారు. బీర్పూర్ మండల కేంద్రానికి చెందిన పూడూరి సుధాకర్, సారంగాపూర్ మండల లక్ష్మిదేవిపల్లికి చెందిన ముత్తునూరి శంకరయ్యకు దళిత బంధు కింద మంజూరైన మారుతి ఎర్టిగా కార్లను శనివారం జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో లబ్ధిదారులకు అందజేసి, మాట్లాడారు.
దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో సీఎం ఈ బృహత్తర పథకాన్ని అమలు చేస్తున్నారని చెప్పారు. ఈ ఒక్కటే కాదు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అనేక పథకాలు ప్రవేశపెడుతూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. ఒక్క రూపాయి బ్యాంకు లోన్ లింకేజీ లేకుండా రూ.10 లక్షలను నేరుగా దళితుల అకౌంట్లలో జమ చేస్తున్నామని, వారికి నచ్చిన యూనిట్ ఎంచుకునేందుకు అవకాశం ఇస్తున్నట్లు వివరించారు. అయితే అందరూ ఒకే యూనిట్ ఎంచుకోకుండా వారికి ఉన్న ప్రతిభ ఆధారంగా సెలెక్ట్ చేసుకొని విజయాలు సాధించాలని సూచించారు.
ప్రతిపక్ష నాయకుల అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని, అభివృద్ధి, సంక్షేమం కండ్ల ముందే కనిపిస్తున్న విషయాన్ని మరిచిపోవద్దని సూచించారు. ఇక్కడ కేబీసీసీబీ జిల్లా సభ్యుడు రామ్‌చందర్ రావు, పాక్స్ చైర్మన్ నరసింహ రెడ్డి, మండల రైతు బందు సమితి కన్వీనర్ కొల శ్రీనివాస్, సర్పంచ్ గర్షకుర్తి శిల్ప రమేశ్, నాయకులు రామచంద్రం, ధనుంజయ్, మల్లేశం, సాంబారు గంగాధర్, సంపత్, శ్రీనివాస్, గంగారాజం ఉన్నారు.