మంథని, ఆగస్టు 20: ‘మంత్రపురి బిడ్డను కాబట్టే ఇక్కడి ప్రజల కష్టనష్టాలు నాకు తెలుసు. నిరంతరం అందుబాటులో ఉన్న. ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేసిన. ఓ అన్నగా, తమ్ముడిగా, కొడుకులా వారి బాధల్లో పాలుపంచుకున్న’ అంటూ పెద్దపల్లి జడ్పీచైర్మన్ పుట్ట మధూకర్ స్పష్టం చేశారు. జడ్పీ నిధుల్లో సింహభాగాన్ని అంగన్వాడీ కేంద్రాల్లో సౌకర్యాల కల్పనకు కేటాయించినట్లు చెప్పారు. కానీ, ఈ గడ్డను 45 ఏండ్లు పాలించిన ఓ కుటుంబం ప్రజలకు చేసిందేంలేమీలేదని మండిపడ్డారు. బస్టాండ్‌లో కనీ సం వసతులు కల్పించలేదని దుయ్యబట్టారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పలు సౌకర్యాలు కల్పించినట్లు గుర్తుచేశారు. జడ్పీ సీఎస్ఆర్ నిధుల నుంచి అంగన్వాడీ సెంటర్లకు మంజూరైన ఫర్నిచర్‌ను శనివారం మంథని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో బల్దియా చైర్పర్సన్ పుట్ట శైలిజతో కలిసి పంపిణీ చేశారు.
ఈసందర్భంగా ఆయన తనదైన శైలిలో ప్రభుత్వ ప్రాధామ్యాల ను వివరిస్తూనే విపక్షాలపై విమర్శల వాగ్బాణా లు సంధించారు. సమైక్య పాలనలో అరిగోసపడ్డ అంగన్వాడీ టీచర్లకు సీఎం కేసీఆర్ సముచిత ప్రాధాన్యమిచ్చారని పేర్కొన్నారు. వారి అమూల్యమైన సేవలను గుర్తించి రెండుసార్లు వేతనాలు పెంచారని గుర్తుచేశారు. సెంటర్లకు వచ్చే గర్భిణులు, తల్లులు, చిన్నారుల సౌకర్యార్థం కుర్చీ లు, సోలార్ఫ్యాన్లు, టేబుళ్లు, ఇతర సామగ్రిని అందజేసినట్లు చెప్పారు. జడ్పీ చైర్మన్‌గా తాను, మున్సిపల్ చైర్‌పర్సన్‌గా తన సతీమణి శైలజ మంథని పట్టణంతోపాటు నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఆపదలో ఉన్న వారిని ఆర్థికంగా ఆదుకుంటున్నామని పేర్కొన్నారు.
ప్రజల కోసం పరితపించే తమపై కొందరు గిట్టనివారు దుష్ప్రచా రం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలని,మంథని నియోజకవర్గం ఎవరి కృషితో అభివృద్ధి చెందిందో ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. పుట్ట శైలజ మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల్లో తల్లులు, గర్భిణులు కింద కూర్చోవద్దనే ఉద్దేశంతో ఫర్నిచర్ అందజేసిన మధూకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్ మాట్లాడుతూ, పుట్ట మధు పనిచేసే నాయకుడని కొనియాడారు. రాబోయే రోజుల్లో ఆయన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇంకా అనేక గొప్పగొప్ప కార్యక్రమాలు చేపడుతారన్నారు.
జడ్పీటీసీ తగరం సుమలతా శంకర్‌లాల్ మాట్లాడుతూ, పుట్ట మధుతోనే మంథని నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని పే ర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కొండ శంక ర్, పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, కౌన్సిలర్లు గర్రెపల్లి సత్యనారాయణ, కుర్రు లింగయ్య, కొట్టేపద్మారమేశ్, నక్క నాగేంద్రశంకర్, కాయితీ సమ్మయ్య, శ్రీపతి బానయ్య,కో-ఆప్షన్ సభ్యులు అంకరి పద్మజా కుమార్, గట్టు రాధాకృష్ణ, సీడీపీవో పద్మశ్రీ, సర్పంచ్‌లు కనవేన శ్రీనివాస్‌యాదవ్, భీముని పుష్పలత వెంకటస్వామి, కారెంగుల సుధాకర్, చెన్నవేన సదానందం ఉన్నారు.