రామడుగు, ఆగస్టు 20: మండల ప్రజలు శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. వెలిచాలలోని శ్రీ సరస్వతీ హైస్కూల్, మండల కేంద్రంలోని బ్రిలియంట్ పాఠశాల, కొక్కెరకుంట అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులు రాధాకృష్ణులు, గోపికల వేషధారణలో ఆకట్టుకున్నారు. విద్యార్థులు ఉట్టికొట్టే కార్యక్రమంలో పాల్గొని అలరించారు.
పలు గ్రామాల్లో యువకులు కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఉట్టికొట్టారు. వెలిచాల జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉదయం యువతులకు ముగ్గుల పోటీలు, సాయంత్రం ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాల్లో ఆయా పాఠశాలల కరస్పాండెంట్లు ఉప్పుల శ్రీనివాస్, తోట కిరణ్‌కుమార్, కో-కరస్పాండెంట్ ఉప్పుల సత్యం, అంగన్వాడీ టీచర్ కనకలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
కొత్తపల్లి, ఆగస్టు 20: మెహర్‌నగర్‌లోని వింధ్యావాలీ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకలు అలరించాయి. చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్, కరస్పాండెంట్ రామవరం లక్ష్మీప్రకాశ్రావు, వైస్ చైర్మన్ పృథ్వీరావు, ప్రిన్సిపాల్ ప్రశాంత్, విద్యార్థులు పాల్గొన్నారు.
కమాన్‌చౌరస్తా, ఆగస్టు 20: నగరంలోని జ్యోతినగర్‌లో గల జ్యోతిష్మతి అకాడమీ పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. వేడుకలను జ్యోతిష్మతి విద్యాసంస్థల అకాడమిక్ చైర్పర్సన్ జువ్వాడి విజయసాగర్ రావు ప్రారంభించారు. శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో విద్యార్థులు అలరించారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే, 8వ డివిజన్లోని అంబేద్కర్‌నగర్‌లో ఉట్టి కొట్టే వేడుకలు నిర్వహించగా, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.