కలెక్టరేట్, ఆగస్టు 20: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో మహిళలు భాగస్వాములై దేశభక్తి, జాతీయ స్ఫూర్తిని చాటడం అభినందనీయమని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ పేర్కొన్నారు. నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని మహిళా ఉద్యోగులు, జిల్లాలోని మహిళలకు శనివారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ, వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంతో పాటు మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే వజ్రోత్సవ ర్యాలీ, సామూహిక జాతీయ గీతాలాపన, రక్తదాన శిబిరం, క్రీడా పోటీలు నిర్వహించినట్లు తెలిపారు.
పిల్లల కోసం పలు సినిమా థియేటర్లలో ఉచితంగా గాంధీ చిత్రాన్ని ప్రదర్శించి, వారికి దేశ స్వాతంత్య్ర పోరాట చరిత్రను తెలియజేయడంతో పాటు అహింసా మార్గంలో స్వాతంత్య్రం తెచ్చిన జాతిపిత గాంధీజీ ఉద్యమ నేపథ్యాన్ని వివరించినట్లు చెప్పారు. రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన జే నిర్మలకు ప్రథమ బహుమతి, తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కస్తూరి స్వరూపకు ద్వితీయ, జిల్లా కేంద్రానికి చెందిన ఎం లక్ష్మీఅక్షయకు తృతీయ బహుమతి అందజేశారు. పోటీల్లో పాల్గొన్న మహిళలందరికీ ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డీఆర్డీవో ఎల్ శ్రీలతారెడ్డి, సహకార అధికారి శ్రీమాల, ఆత్మ పీడీ ప్రియదర్శిని, డీఎస్డీవో రాజవీరు, బీసీడీవో రాజమనోహర్, ఎన్‌వైకే కో-ఆర్డినేటర్ వెంకటరాంబాబు, డీడబ్ల్యూవో పద్మావతి పాల్గొన్నారు.
కార్పొరేషన్, ఆగస్టు 20: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో బల్దియా ఆధ్వర్యంలో శనివారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. మెప్మా, నగరపాలక సంస్థకు చెందిన సుమారు 40 మంది మహిళా సిబ్బంది పాల్గొన్నారు. జాతీయ భావం ఉట్టి పడేలా త్రివర్ణ పతాకం, భారతదేశంతో పాటు వివిధ రకాల ఆకృతులతో వేసిన ముగ్గులు ఆకట్టుకున్నాయి. విజేతలకు డిప్యూటీ కమిషనర్ త్రయంభకేశ్వర్, కార్పొరేటర్లు గుగ్గిళ్ల జయశ్రీ, శ్రీదేవి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ రాజేశ్వర్, డీఎంసీ శ్రీవాణి, టీఎంసీ అనిత తదితరులు పాల్గొన్నారు.
కొత్తపల్లి, ఆగస్టు 20: వజ్రోత్సవాల్లో భాగంగా మండలంలోని ఆసీఫ్‌నగర్ గ్రామంలో ఎంపీపీ పిల్లి శ్రీలత-మహేశ్‌గౌడ్ అంగన్వాడీ టీచర్లకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, మండలంలో చేపట్టే సామూహిక హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు మెంగని పద్మ, వెంకటలక్ష్మి, దూలం సుధాకర్, శేఖర్, లావణ్య, సుధా తదితరులు పాల్గొన్నారు.
చొప్పదండి, ఆగస్టు 20: పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో, పెద్దకుర్మపల్లిలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, సర్పంచ్ తొట్ల గంగమల్లయ్య మాట్లాడుతూ, వజ్రోత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వడం అభినందనీయమని పేర్కొన్నారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఇప్పనపల్లి విజయలక్ష్మి, కౌన్సిలర్లు మహేశుని సంధ్య, చేపూరి హేమ, బిజిలి అనిత, కొత్తూరి స్వతంత్రభారతి, పెరుమండ్ల మానస, దండె జమున, నలుమాచు జ్యోతి, మున్సిపల్ కమిషనర్ శాంతికుమార్, మేనేజర్ ప్రశాంత్ కుమార్, నాయకులు ఇప్పనపల్లి సాంబయ్య, పెరుమండ్ల గంగయ్య, కొత్తూరి నరేశ్, మహేశుని మల్లేశం పాల్గొన్నారు.
గంగాధర, ఆగస్టు 20: మండలంలోని కురిక్యాల, మల్లాపూర్, మంగపేట, గోపాల్రావుపల్లి, ఆచంపల్లి, కోట్లనర్సింహులపల్లి గ్రామాల్లో సర్పంచులు ఆధ్వర్యంలో చిన్నారులకు ఆటల పోటీలు, మహిళలు, బాలికలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో సర్పంచులు మేచినేని నవీన్‌రావు, ఆకుల శంకరయ్య, తోట వేదాంతి, రాసూరి మల్లేశం, కొంకటి శంకర్, తోట కవిత, ఎంపీటీసీ కోలపురం లక్ష్మణ్, ఉపసర్పంచ్ కడారి కనకయ్య, భైరి కార్తీక్‌రెడ్డి, నాయకులు తోట మహిపాల్, మల్లారెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు.