చిగురుమామిడి, ఆగస్టు 20: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో మండల అధికారుల ఆధ్వర్యంలో మండల స్థాయి ముగ్గుల పోటీలు నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో పోటీలో పాల్గొన్నారు. సందేశాత్మక ముగ్గులు వేశారు. పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీపీ కొత్త వినీతాశ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ఆర్థిక పురోగతి సాధించే దిశగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. మహిళలు స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటేలా ముగ్గులు వేయడం అభినందనీయమన్నారు.
ముగ్గుల పోటీల్లో సీనియర్స్ విభాగంలో కత్తి రమాదేవి (ఇందుర్తి) మొదటి బహుమతి, పైసా రమ (రామంచ) రెండో బహుమతి, శ్వేత (చిగురుమామిడి) మూడో బహుమతి, జూనియర్స్ విభాగంలో కస్తూర్బా విద్యార్థులు ఎస్ స్ఫూర్తి మొదటి బహుమతి, జే అంజలి రెండో బహుమతికి ఎంపికయ్యారు. వీరికి మండల స్థాయి వజ్రోత్సవాలు ముగింపు కార్యక్రమంలో సోమవారం బహుమతులను అందజేయనున్నట్లు ఎంపీపీ తెలిపారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ గీకురు రవీందర్, ఎంపీడీవో నర్సయ్య, ఎస్ఐ దాస సుధాకర్, మండల పరిషత్ సూపరింటెండెంట్ ఖాజా మొయినుద్దీన్, సెర్ప్ ఏపీఎం మట్టెల సంపత్, ఏపీవో లక్ష్మి, సర్పంచ్ బెజ్జంకి లక్ష్మణ్, పంచాయతీ కార్యదర్శి వెంకటరమణ, కారోబార్ సత్యనారాయణ, సీసీలు సత్యనారాయణ, గంప సంపత్, వెంకటమల్లు, దుబ్బాక వెంకటేశ్వర్లు, మండల సమాఖ్య అధ్యక్షురాలు హరిణి, మౌనిక, శైలజ, శివ, లక్ష్మణ్, వివిధ గ్రామాల చెందిన ఎస్‌హెచ్‌జీ సభ్యులు పాల్గొన్నారు.
శంకరపట్నం, ఆగస్టు 20: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం మండలంలోని గద్దపాక గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మహిళలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల్లో విజేతలైన కరుణ, మమతకు సర్పంచ్ గోపు విజయ్‌కుమార్‌రెడ్డి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుమన్, వార్డు సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.
గన్నేరువరం, ఆగస్టు 20: గన్నేరువరం గ్రామ పంచా యతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ పుల్లెల లక్ష్మీ లక్ష్మణ్, పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ చూపిన వారికి ప్రజాప్రతినిధులు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ న్యాత స్వప్నా సుధాకర్, నాయకులు కొట్టె భూమయ్య, బొడ్డు భాస్కర్, బూర తిరుపతి, పుల్లెల సాయి, కుమార్ యాదవ్, జీల మహేశ్, పాలక వర్గం సభ్యులు, మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు.