పెద్దపల్లి టౌన్, ఆగస్టు 19: తల్లీబిడ్డల సంరక్షణే రాష్ట్ర సర్కారు ధ్యేయమని, ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నదని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానలోని మాతా శిశు సంక్షేమ కేంద్రం ప్రసూతి వార్డులో చికిత్స పొందుతున్న బాలింతలకు కేసీఆర్ కిట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రసూతి వార్డులో అందుతున్న సౌకర్యాలపై బాలింతలను మంత్రి అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వ దవాఖానల్లో ప్రైవేట్‌కు దీటుగా వైద్యసేవలు అందిస్తున్నారని చెప్పారు. ఎంసీహెచ్‌లో సాధారణ ప్రసవాలు పెరిగేలా కృషి చేయాలని వైద్యులకు సూచించారు. దవాఖానలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. భావి భారత పౌరులకు మహాత్మాగాంధీ దేశానికి అందించిన సేవలు, స్వాతం త్య్ర పోరాట చరిత్రను విద్యార్థ్ధులకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.
అంతకుముం దు కలెక్టర్ సంగీత సత్యనారాయణ దవాఖాన పరిసరాలను తనిఖీ చేశారు. ఇక్కడ జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, కలెక్టర్ సంగీత సత్యనారాయణ, అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.