కమాన్‌చౌరస్తా/ జగిత్యాల విద్యానగర్/ పెద్దపల్లి కమాన్/సిరిసిల్ల తెలంగాణచౌక్ డిసెంబర్ 16: రాష్ట్రవ్యాప్తంగా గురువారం విడుదలైన జూనియర్ ఇంటర్మీడియట్-2021 ఫలితాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు. అందులో బాలికలే టాప్‌గా నిలిచారు. కరీంనగర్ జిల్లా 48. 64 శాతం ఉత్తీర్ణతతో ఉమ్మడిజిల్లాలోనే మొదటి స్థానం దక్కించుకున్నది. 41 శాతం ఉత్తీర్ణతో జగిత్యాల ద్వితీయ స్థానం, 37.8 శాతంతో పెద్దపల్లి, 37 శాతంతో రాజన్నసిరిసిల్ల జిల్లా తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
కరీంనగర్ జిల్లావ్యాప్తంగా జనరల్, వొకేషనల్ విభాగాల్లో 16733 మంది పరీక్షలు రాయగా 8139 మంది విద్యార్థులు పాసయ్యారని జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి రాజ్యలక్ష్మి తెలిపారు. జనరల్‌లో 7257 మంది, వోకేషనల్‌లో 882 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు.
జగిత్యాల జిల్లాలో 41 శాతం ఉత్తీర్ణత నమోదైందని ఇంటర్మీడియట్ విద్య జగిత్యాల జిల్లా నోడల్ అధికారి బొప్పరాతి నారాయణ గురువారం తెలిపారు. జనరల్, వొకేషనల్ విభాగాల్లో 9,260 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 3,821మంది విద్యార్థులు పాసయ్యారు. జనరల్‌లో 7937మంది విద్యార్థులకు గానూ 3247 మంది, వొకేషనల్‌లో 1323 మందికి 574 మంది పాసయ్యారు. జనరల్ బాలుర విభాగంలో 3585 మందికి గానూ 1086 మందితో 30 శాతం, జనరల్ బాలికల విభాగంలో 4352 మంది విద్యార్థులకు గానూ 2161మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడంతో 50 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
వొకేషనల్ బాలుర విభాగంలో 950మంది విద్యార్థులకు గానూ 320మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడంతో 34శాతం, వొకేషనల్ బాలికలలో 373 మందికి గానూ 254మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడంతో 68 శాతం, మొత్తంగా జనరల్, వొకేషనల్ బాలుర విభాగంలో 4535 మంది విద్యార్థులకు గానూ 1406మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడంతో 31శాతం ఉత్తీర్ణత నమోదైంది. జనరల్, ఒకేషనల్ బాలికల విభాగంలో 4725మంది విద్యార్థులకు గా నూ 2412మంది విద్యార్థులు ఉత్తీర్ణత సా ధించడంతో 51శాతం ఉత్తీర్ణత నమోదైంది.
పెద్దపల్లి జిల్లాలో 37.8 శాతం ఉత్తీర్ణత నమోదైందని జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి కల్పన పేర్కొన్నారు. ఇంటర్ జనరల్ విభాగంలో 5307 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 1865 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 548 మంది బాలురు కాగా, 1317 మంది బాలికలు పాసయ్యారు. వొకేషనల్ విభాగంలో 1238 విద్యార్థులు పరీక్ష రాయగా, 613 మంది విద్యార్థులు పాసయ్యారు. అందులో 185 మంది బాలురు కాగా, 428 మంది బాలికలు ఉత్తీర్ణత సాధించినట్లు నోడల్ అధికారి వెల్లడించారు.
రాజన్నసిరిసిల్ల జిల్లాలో 37 శాతం ఉత్తీర్ణత నమోదైందని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సీహెచ్ మోహన్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 4498 మంది విద్యార్థులు హాజరయ్యారు. 1666 మంది విద్యార్థులు పాసయ్యారు. జనరల్ విభాగంలో 3959 మంది విద్యార్థులకు 1400 పాస్ కాగా 35 ఉత్తీర్ణత శాతం సాధించారు. ఇందులో 15 52 మంది బాలురకు 375 ఉత్తీర్ణులై 24 శాతం సాధించగా బాలికలు 2407 మందికి గాను 1025 ఉత్తీర్ణత సాధించి 43శాతం ముందజలో ఉన్నారు. వొకేషనల్ విభాగంలో మొత్తం బాలబాలికలు 539 మంది విద్యార్థులకు 266 పాసైనట్లు పేర్కొన్నారు.