గంగాధర, ఆగస్టు 13 : ప్రముఖ పర్యాటక కేంద్రం బొ మ్మలమ్మ గుట్ట చరిత్రకు సజీ వ సాక్ష్యంగా నిలిచిందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం బొమ్మలమ్మ గుట్టపై ఎమ్మెల్యే, జీవీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యాటక కేంద్రమైన బొమ్మలమ్మ గుట్ట గురించి సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడినట్లు గుర్తు చేశారు. గుట్టపై ఉన్న యక్షిణి విగ్రహం, బాహుబలి, తీర్థంకరుల విగ్రహాలు చరిత్రకు, జైన మత వ్యాప్తికి నిదర్శనంగా నిలిచాయన్నారు. గుట్ట అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న వజ్రోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
బొమ్మలమ్మ గుట్టపై చారిత్రకు సంపదను కాపాడుకోవాల్సిన భాద్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కొండపై ఉన్న కంద పద్యం తెలుగు భాషకు ప్రాచీన హోదా రావడానికి ఆధారం కావడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో భాస్కర్‌రావు, ఎంపీవో జనార్ధన్‌రెడ్డి, ఎస్ఐ రాజు, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, గంగాధర సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, ఎంపీటీసీ ద్యావ మధుసూదన్‌రెడ్డి, ఉపసర్పంచ్ నిమ్మనవేణి ప్రభాకర్, నాయకులు వేముల అంజి, బొల్లాడి శ్రీనివాస్‌రెడ్డి, రామిడి సురేందర్, రేండ్ల శ్రీనివాస్, లింగాల దుర్గయ్య, గంగాధర కుమార్, పెంచాల చందు, మ్యాక వినోద్, మామిడిపెల్లి అఖిల్, సముద్రాల ఓంకార పాల్గొన్నారు.