శంకరపట్నం, జూలై 30: ఆర్థిక అసమానతలు రూపుమాపేందుకే సీఎం కేసీఆర్ దళితబంధు పథకం ప్రవేశపెట్టారని జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండలంలోని కన్నాపూర్ ఎస్సీ కాలనీలో సర్పంచ్ కాటం వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో సివిల్ రైట్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ సర్కారు దళితల అభ్యున్నతికి ఎన్నో విప్లవాత్మక పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా కులవివక్ష చూపితే వెంటనే ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. మండల ముఖ్య అధికారులు సివిల్ రైట్స్ డేకు హాజరుకాకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని పలువురు దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో రోడ్లను బాగు చేయాలని, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీవో బషీరొద్దీన్, వైస్ ఎంపీపీ రమేశ్, ఎంపీటీసీ మోతె భాగ్యలక్ష్మి, గిర్దావర్ లక్ష్మారెడ్డి, హెడ్ కానిస్టేబుల్ పరంథాములు, ఉప సర్పంచ్ కుమార్, కార్యదర్శి పరశురాములు, దళిత సంఘాల నాయకులు కనకం శంకర్, శనిగరపు ఐలయ్య, మెరుగు శ్రీనివాస్, క్యాదాసి భాస్కర్, బూర్తుల రాజేశ్, దేవునూరి భాస్కర్, ఆరెపల్లి ఓదెలు పాల్గొన్నారు.
హకులను వినియోగించుకోవాలి
రాజ్యాంగం కల్పించిన హకులను బాధ్యతగా వినియోగించుకోవాలని ఎంపీపీ కొత్త వినీతాశ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. సుందరగిరిలో పౌర హకుల దినోత్సవాన్ని పురసరించుకొని ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భారత రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికీ హకులు కల్పించారన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్‌లో అనేక కులాలు, మతాలు, వర్గాలున్నప్పటికీ అందరినీ ఏకతాటిపై నడిపించేది భారత రాజ్యాంగమని పేరొన్నారు. సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని, కుల వివక్ష నిర్మూలన కోసం ప్రతి ఒకరూ పాటు పడాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ ముబీన్‌అహ్మద్, ఎస్సై దాస సుధాకర్, ఎంపీడీవో నర్సయ్య, సర్పంచ్ శ్రీమూర్తి రమేశ్, ఎంపీటీసీ మెడబోయిన తిరుపతి, మండల వైద్యాధికారి నాగశేఖర్ , ఆర్ఐ శైలజ, వార్డు సభ్యుడు దిలీప్‌కుమార్, అంబేదర్ సంఘం అధ్యక్షుడు కనకయ్య, కార్యదర్శి రాజేశ్వరరావు పాల్గొన్నారు.
గ్రామాభివృద్ధికి పాటుపడాలి
కుల మతాలకతీతంగా ప్రతి ఒక్కరూ గ్రామాభివృద్ధికి పాటుపడాలని ఎలక్షన్ నాయబ్ తహసీల్దార్ నాగార్జున తెలిపారు. శనివారం వేగురుపల్లిలో పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహించి మాట్లాడారు. ఇక్కడ గిర్దావర్ సోనియా, గ్రామ పంచాయతీ సిబ్బంది, వార్డు సభ్యులు, అంబేద్కర్ సంఘం నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.