ధర్మారం, జూలై 30: ఎనిమిదిన్నరేండ్ల సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో సాగు పండుగలా మారిందని రాష్ట్ర ఎస్సీ,మైనార్టీ, దివ్యాంగులశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శనివారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో మంత్రి విస్తృతంగా పర్యటించారు. ధర్మారం మండల పరిషత్ కార్యాలయంలో 70మందికి రూ.21,68, 500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. గోపాల్రావుపేట వైకుంఠధామానికి వెళ్లే రోడ్డులో వంతెనలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుండగా ట్రాక్టర్‌పై 2కిలోమీటర్లు ప్రయాణించి పరిశీలించారు. బొమ్మారెడ్డిపల్లి శివారులో ‘వరినా టు సంబురాలు’ కార్యక్రమంలో పాల్గొని మ హి ళా కూలీలతో కలిసి నాటు వేశారు. మధ్యా హ్నం వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సమైక్య పాలనలో 25 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు సాగు కాగా, స్వరాష్ట్రంలో కోటీ 20 లక్షల ఎకరాలు సాగవుతున్నట్లు పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులు నిర్మించడం, వ్యవసాయానికి 24గంటలు ఉచిత విద్యు త్ సరఫరా చేయడం, రైతుబంధు, సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించడంతో నే ఇది సాధ్యమైందని చెప్పారు.
కేంద్రం బాయిల్డ్ రైస్ తీసుకోబోమని మొండికేస్తే సీఎం కేసీఆర్ యాసంగిలో రైతులు పండించిన మొత్తం ధాన్యా న్ని కొనుగోలు చేశారని గుర్తు చేశారు. ఈ సారి సమృద్ధిగా వానలు పడడంతో ఇప్పటికే 30 నుంచి 40శాతం వరినాట్లు పూర్తయినట్లు చెప్పారు. ఎస్సీ మహిళలు ముందుకు వస్తే స్వయం ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ధర్మపురి నియోజకవర్గం నుంచి అత్యధికంగా సీఎంఆర్ఎఫ్ సాయం అందించినట్లు చెప్పారు. కార్యక్రమాల్లో ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, ఎంపీడీవో బీ జయశీల, ఏఎంసీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, వైస్ చైర్మన్ చొప్పరి చంద్రయ్య, వైస్ ఎంపీపీ మేడవేని తిరుపతి, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ పాకాల రాజయ్య, సర్పంచులు పూస్కూరు జితేందర్‌రావు, జనగామ అంజయ్య, ఎంపీటీసీలు తుమ్మల రాంబాబు, జనగామ లక్ష్మి, గాగిరెడ్డి వేణుగోపాల్‌రెడ్డి, ఉప సర్పంచులు ఆవుల లత, సంకసాని సతీశ్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్, ఏఎంసీ మాజీ చైర్మన్ గుర్రం మోహన్‌రెడ్డి, ప్యాక్స్ మాజీ చైర్మన్ నర్సింగరావు, నీటి పారుదల శాఖ డీఈఈ రమేశ్, ఏఈ శ్రీనివాస్ పాల్గొన్నారు.