కార్పొరేషన్, జూలై 29: ప్రజారోగ్యమే ధ్యేయంగా రాష్ట్ర సర్కార్ పని చేస్తున్నదని మేయర్ యాదగిరి సునీల్‌రావు పేర్కొన్నారు. నగరంలోని కట్టరాంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషకాహార కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ సునీల్‌రావు మాట్లాడుతూ, నగర పరిధిలో ఐదుగురు దివ్యాంగ కిశోర బాలికలను గుర్తించి ఎస్ఏజీ కార్యక్రమం ద్వారా పోషకాహార కిట్లు అందించినట్లు తెలిపారు. పిల్లల్లో పోషకాహార లోపం రాకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వం పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించడానికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పోషకాహార లోపం ఉన్న పిల్లల సంఖ్య తగ్గిందన్నారు. హరితహారంలో భాగంగా ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేస్తామని తెలిపారు. ఇంటి ఆవరణలో నాటి కంటికి రెప్పలా కాపాడాలని ప్రజలను కోరారు. మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, కార్పొరేటర్ ఆకుల నర్మద, టౌన్ ప్లానింగ్ డీసీపీ సుభాష్, ఈఈ కిష్టప్ప, ఐసీడీఎస్ అధికారి ఉమారాణి, అంగన్ వాడీ టీచర్లు పాల్గొన్నారు.
పేదలకు సేవ చేయడం అభినందనీయం
పేదలకు సేవ చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని మేయర్ వై సునీల్‌రావు పేర్కొన్నారు. నగరంలోని 33వ డివిజన్ (భగత్‌నగర్)లో గల ప్రైమరీ పాఠశాలలో అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మేయర్ చేతుల మీదుగా నోట్‌బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సేవా సంస్థ అలయన్స్ క్లబ్ అని అన్నారు. జాతీయ స్థాయిలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి పేదలను ఆదుకుంటున్నదని తెలిపారు. విద్యార్థులను ప్రోత్సహిస్తూ నోట్‌బుక్స్, పెన్నులు అందించడం గొప్ప విషయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో భగత్‌నగర్ క్లబ్ అధ్యక్షుడు మొగిలోజు సత్యాచారి, సెక్రటరీ పండుగ నాగరాజు, కోశాధికారి శీలం సత్తయ్య, ప్రతినిధులు చీకోటి శ్రీనివాస్గాంధీ, ఆంజనేయులు, ప్రభాకర్‌రెడ్డి, గుడాల కృష్ణ, రాజారెడ్డి, ఉయ్యాల శ్రీనివాస్‌గౌడ్, రోహిత్, సాయి, ప్రధానోపాధ్యాయురాలు సంధ్యారాణి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.