చొప్పదండి, జూలై 29: ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పథకాలు అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. గంగాధర మండలం బూరుగుపల్లిలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు రోడ్ల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. భారీ వర్షాలకు నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరైనట్లు పేర్కొన్నారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
చొప్పదండి మండలం రాగంపేట నుంచి చిట్యాలపల్లి జడ్పీ రోడ్డు వరకు మరమ్మతులకు రూ.3 లక్షలు, కాట్నపల్లి నుంచి రుద్రారం వరకు రూ.2 లక్షలు, రామడుగు మండలం శ్రీరాములపల్లె నుంచి మాడిశెట్టిపల్లి వరకు రూ. 2 లక్షలు, కిష్టంపల్లి రోడ్డుకు రూ.2 లక్షలు, గుడ్డెలుగులపల్లి వయా వెలిచాల రోడ్డుకు రూ.2 లక్షలు, గంగాధర మండలం లింగంపల్లి నుంచి బూరుగుపల్లి వరద కాలువ వయా ర్యాలపెల్లి రోడ్డుకు రూ.2 లక్షలు, గంగాధర నుంచి నారాయణపూర్ వయా ఇస్తార్పల్లి రోడ్డుకు రూ.5 లక్షలు, బోయినపల్లి మండలం బోయినపల్లి నుంచి నర్సింగాపూర్ రోడ్డుకు రూ.7.50 లక్షలు, కొదురుపాక నుంచి విలాసాగర్ రూ.9 లక్షలు, బూరుగుపెల్లి నుంచి వెన్నపెల్లి రూ.50 వేలు, బోయినపల్లి నుంచి స్తంభంపల్లి రూ.లక్ష, విలాసాగర్ నుంచి ఆచంపల్లి రూ.లక్ష, విలాసాగర్ నుంచి గర్షకుర్తి రూ.లక్ష, దుండ్రపల్లి నుంచి కోరెం రోడ్డు మరమ్మతులకు రూ.2 లక్షలు మంజూరైనట్లు తెలిపారు.
వీడీసీ చైర్మన్‌కు పరామర్శ
గంగాధర, జూలై 29: మండలంలోని లింగంపల్లి వీడీసీ చైర్మన్ తోట నాంపెల్లి మాతృమూర్తి సత్తమ్మ ఇటీవల మృతి చెందారు. కాగా, శుక్రవారం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పరామర్శించి, మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే, దుబాయ్‌లో గుండెపోటుతో మృతి చెందిన వెంకంపల్లికి చెందిన గుండవేణి రవి కుటుంబసభ్యులను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పరామర్శించారు. తక్షణ సాయంగా రూ. 28 వేలు అందజేశారు. రవి భార్య మమతకు ఉపాధి కల్పిస్తామని, కూతుళ్లు నందిన, శరణ్యను గురుకుల పాఠశాలలో చేర్పిస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట నాయకులు ముద్దం నగేశ్, గుండవేణి తిరుపతి, దూలం శంకర్‌గౌడ్, గడ్డం అంజయ్య, మల్లేశం తదితరులు ఉన్నారు.