గోదావరిఖని, జూలై 23: రాష్ర్టానికి సీఎం కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష అని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శనివారం క్యాంపు కార్యాలయంలో పాలకుర్తి మండలానికి చెందిన బీజేపీ నాయకులు సుంకరి కుమార్, బానోతు రాజేశం, నెర్వట్ల సాయితేజ, చింటు, సందవేణి రాములు యాదవ్‌తోపాటు మరో 50 మంది యువకులు టీఆర్ఎస్లో చేరారు. వీరికి ఎమ్మెల్యే కండువాలు కప్పి ఆహ్వానించారు. ఇక్కడ ఎంపీపీ ఎర్రం స్వామి, నాయకులు తిరుపతి, కొంరయ్య, బండిశ్రీనివాస్ తదితరులున్నారు.
ఖని ఏజీపీగా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే న్యాయ స్థానాల్లో సరైన వసతుల కల్పన జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా నియమాకమైన మేడ చక్రపాణికి జీవో ఉత్తర్వులు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రం వచ్చాకే నూతన కోర్టు ఏర్పాట్లు ఏపీపీ నియామకాలు జరిపారన్నారు. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న గోదావరిఖని సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు విషయమై తాము సీఎంకు విన్నవిస్తానని వివరించారు. అనంతరం ఎమ్మెల్యేను బార్ అసోసియేషన్ సభ్యులు సన్మానించారు. ఇక్కడ న్యాయవాదులు జవ్వాజి శ్రీనివాస్, ఉమర్, అవినాశ్, శ్రీనివాస్, శంకర్, ముచ్చకుర్తి కుమార్, కొప్పుల నరేశ్, అనిల్, కార్పొరేటర్ ధాతు శ్రీనివాస్, నాయకులు అచ్చ వేణు, జేవీ రాజు, మండ రమేశ్ ఉన్నారు.
రూ.50వేల ఎల్వోసీ
గోదావరిఖనికి చెందిన బొంకూరి సునీల్ కుమార్ అనారోగ్యంతో బాధపడుతుండగా ఉన్న త చికిత్స కోసం రూ.50వేలు ఎల్వోసీ మం జూరు చేయించిన ఎమ్మెల్యే, అతడికి అందించారు. ఇక్కడ మేయర్ అనిల్‌కుమార్, కార్పొరేటర్ ఇంజపురి పులెందర్, నాయకులు జేవీ రాజు, తోడేటి శంకర్, అచ్చ వేణు, బొడ్డు రవీందర్, దేవరాజ్, శ్రీనివాస్, మండ రమేశ్ తదితరులు ఉన్నారు.
ఆ లైన్లు తొలగించాలి
ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ లైన్లను తొలగించాలని ఎమ్మెల్యే సూచించారు. విద్యుత్ శాఖ అధికారులతో క్యాంపు కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. కూరగాయల మార్కెట్ నుంచి మొదలుకొని రాజేశ్ థియేటర్ వరకు ఉన్న విద్యుత్ లైన్లు జనావాసాలపై ప్రమాదకరంగా ఉన్నాయని వివరించారు. వాటి స్థానంలో విద్యుత్ టవర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పట్టణ ప్రగతి నిధుల నుంచి సొమ్మును వెచ్చించాలని అధికారులకు సూచించారు. ఇక్కడ ఎన్పీడీసీఎల్ అధికారులు డీఈ తిరుపతి, ఏడీఈ వెంకటేశ్వర్లు ఉన్నారు.
ప్రతి ఎకరాకూ సాగునీరందించాలి…
నియోజక వర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరందించాలని చందర్ అన్నారు. 17 ఎల్, 21 ఎల్ లిఫ్ట్ నిర్మాణ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. బండలవాగును నింపే 17 ఎల్ కాలువ, 21 ఎల్ కాలువల లిఫ్ట్ ఇరిగేషన్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇరిగేషన్ ఈఈ విష్ణు ప్రసాద్, కాంట్రాక్టర్ అంకినీడు ఉన్నారు.