మంథని, జూలై 23: ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం పేదల ప్రజలకు వరం లాంటిదని జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ పేర్కొన్నారు. మంథనిలోని తన నివాసంలో శనివారం బేగంపేట గ్రామానికి చెందిన తాళ్లపెళ్లి రమేశ్‌కు రూ. 60,000 సీఎంఆర్ఎప్ చెకును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజల ఆరోగ్యానికి అండగా నిలిచిందని చెప్పేందుకు మంథని నియోజకవర్గమే నిదర్శనమన్నారు. సీఎం సహాయ నిధిని అర్హులైన ప్రతి ఒకరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రామగిరి ఎంపీపీ ఆరెల్లి దేవక కొమురయ్య గౌడ్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
లక్ష ఎల్వోసీ అందజేత
మంథని రూరల్, జూలై 23: బిట్టుపల్లికి చెందిన బిర రామయ్య అనారోగ్యంతో నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతూ సాయం కోసం అభ్యర్థించగా, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ వెంట నే స్పందించారు. రూ. లక్ష ఎల్వోసీని మంజూ రు చేయించారు. మంథనిలోని తన నివాసంలో రామయ్య కుటుంబ సభ్యులకు అందజేశారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
రచ్చపల్లి ఆర్అండ్ఆర్ కాలనీలో ఐలి రామ య్య, గోపాల్‌పూర్‌లో గోషిక శ్రీను, ఎగ్లాస్పూర్ లో మంథని గట్టయ్య మృతి చెందగా, వారి కుటుంబాలను జడ్పీ చైర్మన్ పరామర్శించారు. చిత్ర పటాల వద్ద నివాళులర్పించారు.