జూలపల్లి, జూలై 23 : ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన వరద బాధితులు ఆత్మ విశ్వాసం కోల్పోవద్దని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి భరోసా ఇచ్చారు. జూలపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం మండలంలోని 38 మంది వరద బాధితులకు తాత్కాలిక సా యంగా ప్రభుత్వం తరఫున రూ. 3200 చొప్పున నగదు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేనివిధంగా 150 శాతం అధికంగా భారీ వర్షాలు పడినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. అనంతరం హరితహారంలో భాగంగా ఎమ్మెల్యే గ్రామస్తులకు మొక్కలు పంపిణీ చేశారు. మొక్కల ఎదుగుదలపై ప్రత్యేక శ్రదధ తీసకోవాలని పేర్కొన్నారు.
ఎమ్మెల్యేకు వినతి
మండలంలో పాత వంతెనలు పూర్తిగా తొలగించి కొత్తవి నిర్మించాలని కోరుతూ ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. భారీ వర్షాలకు హుస్సేనిమియా వాగుపై ఉన్న జూలపల్లి-పెద్దాపూర్, వడ్కాపూర్-ధూళికట్ట, వెంకట్రావ్పల్లి-లోకపేట, తేలుకుంట-చీమలపేట, కోనరావుపేట-ధూళికట్ట మధ్య వంతెనలు, కల్వర్టులు పూర్తిగా దెబ్బతిన్నాయని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక చొరవ తీసుకుని నిధులు మంజూరు చేయించాలని, సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఇక్కడ జడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్, సర్పంచులు బంటు ఎల్లయ్య, ఈర్ల మల్లేశం, ఎంపీటీసీ తమ్మడవేని మల్లేశం, తహసీల్దార్ అబుబాకర్, ఎంపీడీవో వేణుగోపాల్‌రావు, ఎంపీవో కిరణ్, ఏపీవో సదానందం, టీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కుంట రాజేశ్వర్‌రెడ్డి, నాయకులు కూసుకుంట్ల రాంగోపాల్‌రెడ్డి, పొట్టాల మల్లేశం, కొప్పుల మహేశ్, చొప్పరి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.