గోదావరిఖని, జూలై 23: దేశంలోనే గొప్ప మంత్రి, ఐటీ రంగంలో తెలంగాణ రాష్ర్టాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపిన ప్రగతి రథసారథి రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ అని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అభివర్ణించారు. ఆదివారం మంత్రి జన్మదినాన్ని పురస్కరించుకొని రామగుండంలో కృతజ్ఞతా యువజన కవాతును నిర్వహించనున్నామని వెల్లడించారు. ఈ మేరకు శనివారం క్యాంపు కార్యాలయంలో కవాతు పోస్టర్‌ను ఆవిష్కరించి, మాట్లాడారు. యువతరానికి ఆదర్శం, జనం మెచ్చిన నాయకుడు కేటీఆర్ జన్మదినం అంటే తెలంగాణ ప్రజలకు పండుగ రోజు అని చెప్పారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ దేశ విదేశాల్లో పర్యటించి ఐటీ సంస్థలను రాష్ర్టానికి రప్పించి ఐటీ రంగాన్ని విస్తరించారని, వేలాది మంది యువతకు ఉద్యోగాలు కల్పించారని కొనియాడారు.
తెలంగాణను ఆర్థికపరంగా అభివృద్ధి చేయడంతోపాటు ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో అగ్రభాగాన నిలిపిన ఘనత కేటీఆర్‌దేనని ఉద్ఘాటించారు. కేటీఆర్ బర్త్‌డే సందర్భంగా ఆదివారం ఉదయం 9గంటలకు స్థానిక ఫైవింక్లయిన్ చౌరస్తా నుంచి మున్సిపల్ అంబేద్కర్ విగ్రహం దాకా కవాతు నిర్వహిస్తామని, నియోజకవర్గంలోని యువలోకమంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు సేవా కార్యక్రమాల్లో నిమగ్నం కావాలని, వరద బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేయాలని సూచించారు. మేయర్ అనిల్‌కుమార్, కార్పొరేటర్లు ఇంజపురి పులేందర్, కుమ్మరి శ్రీనివాస్, నాయకులు తోడేటి శంకర్‌గౌడ్, బొడ్డు రవీందర్, అచ్చ వేణు, నూతి తిరుపతి, దేవరాజు, జేవీ రాజు, మారుతి, బొడ్డుపల్లి శ్రీనివాస్, రాజు, మట్ట మహేందర్, మండ రమేశ్, శ్రీనివాసరెడ్డి, దాసరి ఎల్లయ్య, ముప్పు సురేశ్, ప్రశాంత్, నీరటి శ్రీనివాస్, కొంరయ్య, మల్లన్న, ఓదెలు ఉన్నారు.