కమాన్ చౌరస్తా, డిసెంబర్ 16: జూనియర్ ఇంటర్-2021 ఫలితాల్లో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అల్ఫోర్స్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. పలు విభాగాల్లో రాష్ట్రస్థాయిలో మెరుగైన ర్యాంకులు సాధించారు. ఎంపీసీ విభాగంలో మేకల కావేరి467/470, వీ హేమశ్రీ 467, ఈ నవ్యశ్రీ 467, సిద్రాహైమన్ 467, ఏ.సాయిప్రణవి 467 మారులతో స్టేట్ టాపర్‌గా నిలిచారు. ఎంఈసీ విభాగంలో లక్ష్మీనివాస్ 494/500 మారులతో ప్రథమ స్థానం సాధించాడు. అలాగే వీ శ్రీనందిని 492, జీ శ్రీ చక్రిత 492 మార్కులు పొందారు. బీపీసీలో ఆకుల అర్చన 437/440, కోలా హరిక 437/440 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంకులు సాధించారు. ఈ. సంకీర్తన 435 మారులు పొందింది. సీఈసీలో కీర్తి విద్యాధరణి 478/500, డీ సాయిప్రసన్న 476 మారులు దక్కించుకున్నారని చెప్పారు. కాగా, కరీంనగర్‌లోని వావిలాలపల్లిలోని విద్యా సంస్థల కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులను అల్ఫోర్స్ చైర్మన్ డాక్టర్ వీ నరేందర్‌రెడ్డి అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించి ఉన్నతస్థాయిలో స్థిరపడాలని అభిలషించారు.
మెరిసిన కోరుట్ల విద్యార్థులు
ప్రభుత్వం గురువారం ప్రకటించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాల్లో కోరుట్లకు చెందిన విద్యార్థులు సత్తాచాటారు. కోరుట్ల శ్రీచైతన్య జూనియర్ కళాశాల విద్యార్థిని రౌతు శ్రియ ఎంపీసీలో 467/470 మార్కులతో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించినట్లు కరస్పాండెంట్ నలువాల శేఖర్‌రెడ్డి తెలిపారు. మాస్ట్రో కళాశాల విద్యార్థిని అరిసెల్ల మధుమిత ఎంపీసీలో 465/470 మార్కులతో మూడో ర్యాంకు సాధించింది.