జమ్మికుంట, జూలై 21: జమ్మికుంటలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌తో కలిసి పట్టణంలో కలియదిరిగారు. భారీ వర్షాలకు కాలనీ మునిగి పోతున్నదని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని 6వ వార్డు కౌన్సిలర్ శ్రీపతి నరేశ్ గౌడ్, స్థానికుల విజ్ఞప్తితో ముందుగా హౌసింగ్ బోర్డు కాలనీకి వచ్చారు. శ్రీరామ దవాఖాన దగ్గర్నుంచి కాలనీలోని పలు ఏరియాల్లో నిర్మించిన వరద కాలువను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిష్కార మార్గాలు చూపుతానని హామీ ఇచ్చారు.
కాలనీల్లో జ్వర సర్వే చేస్తున్న ఆరోగ్య సిబ్బందిని కలిశారు. వర్షాలు కురుస్తున్నందున డెంగ్యూ, తదితర రోగాలు దరి చేరకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, పరీక్షలు చేస్తూ మెడికల్ కిట్లు అందించాలని సూచించారు. తర్వాత ప్రభుత్వ దవాఖాన సందర్శించారు. సూపరింటెండెంట్ డాక్టర్ సురేశ్, వైద్య సిబ్బందితో కలిసి దవాఖానలో గదులు, పరికరాలు చూశారు. దవాఖాన ఆవరణలో బురద, నీరు నిలిచి ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. మట్టి పోయించాలని, ద వాఖాన ఏరియా అంతా శుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యకు సూచించారు. 27,28వ వార్డుల కౌన్సిలర్లను సమన్వయం చేస్తూ.. కాలనీల్లో ఉన్న స మస్యలను వెంటనే పరిష్కరించాలని కమిషనర్ కు సూచించారు.
పట్టణానికి చెందిన బోరగాల అరుణ-శ్రీనివాస్ మాధవి ఆయిల్ మార్చంట్, రైస్ డిపో, కిరాణం షాపును ఏర్పాటు చేసుకో గా, దళిత బంధు యూనిట్‌ను ప్రారంభించారు. ఇక్కడ మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక ఎంపీపీలు మమతా ప్రసాద్, పావనీ వెంకటేశ్, రేణుకా తిరుపతిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పొనగంటి సంపత్, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజ్‌కుమార్, కౌన్సిలర్లు వీరన్న, భిక్షపతి, రవీందర్, స్వరూపా శ్రీహరి, శ్వేతా రమేశ్, సా రంగం, రాము, విజయలక్ష్మీ మల్లయ్య, ప్రణీత, శ్రీనివాస్, రమేశ్, రాజయ్య, రాధ, పూలమ్మ, మల్లయ్య, రాము, భాస్కర్, దీప్తి, రాజ్‌కుమార్, నాయకులు దేశిని కోటి, దిలీప్ ఉన్నారు.