సైదాపూర్, జూలై 15: ఉపాధి హామీ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ ఉప కార్యదర్శి హెచ్ఆర్ మీనా సూచించారు. మండలంలోని వెన్నపల్లి, ఎలబోతారం, రాయికల్ గ్రామాల్లో శుక్రవారం ఆయన కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, ప్రాజెక్ట్ మేనేజర్ వివేక్‌రాజ్, కేంద్ర బృందం సభ్యుడు పంకజ్శర్మతో కలిసి పరిశీలించారు. ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన కందకాలు, చెరువుల పూడికతీత, మొక్కల పెంపకం, సెగ్రిగేషన్ షెడ్డు, తదితర పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉపాధిహామీ పనుల రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ ఉప కార్యదర్శి హెచ్ఆర్ మీనా మాట్లాడుతూ, ఉపాధిహామీ పథకం గ్రామీణ ప్రాంత ప్రజలకు వరంలాంటిదన్నారు. అనంతరం రైతు వేదికలో వెన్నంపల్లి మహిళా సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఐకేపీ ద్వారా మహిళలు పొందుతున్న లబ్ధి, అందిస్తున్న రుణాల గురించి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ, మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో శ్రీలత, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉప కమిషనర్ శ్రీనివాస్, వెన్నంపల్లి సింగిల్‌విండో చైర్మన్ బిల్ల వెంకటరెడ్డి, సర్పంచులు అబ్బిడి పద్మారవీందర్రెడ్డి, కేడిక మధుకర్‌రెడ్డి, మ్యాకల శిరీష-ముకుందరెడ్డి, వైస్ ఎంపీపీ రావుల శ్రీధర్‌రెడ్డి, అదనపు పీడీ సంధ్యారాణి, ఏపీడీ కృష్ణ, తహసీల్దార్ సదానందం, ఏపీఎం చెన్నబోయిన కుమారస్వామి, ఏపీవో రాణి, ఎంపీడీవో పద్మావతి, ఎంపీవో రాజశేఖర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి పోరెడ్డి నరేందర్‌రెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి పాల్గొన్నారు.
కలెక్టర్‌తో ఉపాధి హామీ కేంద్ర బృందం భేటీ
కలెక్టరేట్, జూలై 15: జిల్లాలో జరుగుతున్న నరేగా పనుల పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌తో సమావేశమయ్యారు. జిల్లాలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులపై చర్చించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నరేగా పథకం కింద జిల్లాలోని 313 పంచాయతీల్లో చేపట్టిన పనుల వివరాలు, కూలీలకు చెల్లించిన వేతనాలు, తదితర అంశాలను బృందం సభ్యులకు వివరించారు. అనంతరం డీఆర్డీవో శ్రీలత మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకం కింద జిల్లా వ్యాప్తంగా 1.47 లక్షల జాబ్ కార్డులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.3,951.75 లక్షలు ఖర్చు చేసినట్లు తెలిపారు. రూ.2,549.48 లక్షలు వేతనాలు, రూ.1,351.12 లక్షలు మెటీరియల్ అండ్ స్కిల్డ్ కింద ఖర్చు చేసినట్లు స్పష్టం చేశారు. జిల్లాలో చేపట్టిన ఉపాధి పనులను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కేంద్ర బృందానికి వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీ, కేంద్ర కమిటీ టీం లీడర్ హెచ్ ఆర్ మీనా, సభ్యులు వివేక్ రాజ్, పంకజ్ శర్మ, దినేశ్‌కుమార్, డీఆర్డీవో శ్రీలత, డీపీవో వీరబుచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.