ఎస్సారెస్పీ గేట్లు ఎత్తడంతో పెరుగుతున్న నీటి మట్టం
గోదావరి మహోగ్రరూపం దాల్చింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉప్పొంగుతున్నది. ఎగువన మహారాష్ట్రతోపాటు రాష్ట్రంలోని నదీ పరీవాహక ప్రాంతంలో విస్తృత వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఇంకా ఎస్సారెస్పీ, కడెం గేట్లు ఎత్తడంతో మరింత ఉధృతంగా పారుతున్నది. కమ్మునూర్, ధర్మపురి వద్ద నీటిమట్టం పెరిగిపోతున్నది. ఎల్లంపల్లి బరాజ్ నుంచి లక్ష్మీ బరాజ్ దాకా లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, అప్రమత్తమైన యంత్రాంగం ధర్మపురి, రామగుండం, మంథనిలో ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది.
పెద్దపల్లి, జూలై 13 (నమస్తే తెలంగాణ): గోదావరి ఉప్పొంగుతున్నది. పరీవాహక ప్రాంతంలో విస్తృతంగా వర్షాలు కురుస్తుండడంతో వరద పోటెత్తుతోంది. జూలై లో గోదావరికి ఇంత భారీ వరద రావడం గత కొన్నేండ్లలో ఇదే ప్రథమం. గోదావరి బేసిన్ పరిధిలో సోమవారం రాత్రి, మంగళవారం భారీ వర్షాలు కురవడంతో కడెంవాగు, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, తాలిపేరు, కిన్నెరసాని, పెద్దవాగు తదితర ఉప నదులు ఉప్పొంగుతున్నాయి. దాంతో గోదావరికి వరద పోటెత్తుతోంది.
మరింత ఉగ్రరూపం..
మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్‌కు భారీగా వరద వస్తున్న విషయం తెలిసిందే. పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో మూడు రోజులుగా గేట్లు ఎత్తి నీటిని వి డుదల చేస్తున్నారు. ఇంకా నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజె క్టుకు భారీగా వరద వస్తుండడంతో అక్కడా గేట్లు ఎత్తారు. దీంతో జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం కుమ్ము నూర్, అలాగే ధర్మపురి వద్ద గోదావరి ఉగ్రరూ పం దాల్చుతున్నది. గంటగంటకూ నీటి మట్టం పెరుగు తున్నది. దీంతో బ్రాహ్మణ సంఘ భవనం, సంస్కృత కళాశాల, హరిత హోటల్‌ను తాకుతూ ప్రవహిస్తున్నది. అటు గోదావరిఖని, మంథని పరీవాహక ప్రాంతాల్లో వ రద ఉధృతి పెరిగింది. యంత్రాంగం ప్రమాద హెచ్చ రికలు కూడా జారీ చేసింది. కాగా, బుధవారం సమీప గ్రామాలు, కాలనీల్లోకి నీరు చేరగా, యంత్రాంగం అ ప్రమత్తమైంది. రెస్యూ టీంలతో రక్షణ చర్యలు చేపట్టి, పునరావాస కేంద్రాలకు తరలించింది.
ఎల్లంపల్లికి 12లక్షల ఇన్‌ఫ్లో..
ఎస్సారెస్పీ, కడెం గేట్లు ఎత్తడంతో గోదావరి ఉ ప్పెనలా తరలివస్తున్నది. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మం డలంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఏకంగా 12, 25, 320 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. దీంతో గో దావరిఖని, దిగువన మంథని పరీవాహక ప్రాంతంలో గ్రామాల్లోకి నీరు చేరుతున్నది. 20.17 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టులో 14.85 టీఎంసీల నీటిని స్థిరంగా ఉంచుతూ 50 గేట్లు ఎత్తి 11,69, 515 క్యూసెక్కుల నీటిని దిగువన పార్వతీ బరాజ్‌లోకి వదు లుతున్నారు. 8.83 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ బరాజ్‌కు వచ్చిన నీటిని వచ్చినట్లుగా 72 గేట్ల ద్వారా 11,67, 190 క్యూసెక్కుల నీటిని దిగువన సరస్వతీ బరాజ్‌కు వదులుతున్నారు. 10.87టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న సరస్వతీ బరాజ్‌కు పై నుంచి వచ్చిన వరదతోపాటు స్థానిక వాగుల ద్వారా వస్తున్న 13,25, 076 క్యూసెక్కులను 66 గేట్ల ద్వారా లక్ష్మీబరాజ్లోకి పంపుతున్నారు. 16.17టీఎంసీల సామర్థ్యం కలిగిన లక్ష్మీ బరాజ్‌కు 18, 52, 390 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండ గా, అంతే మొత్తంలో బయటికి పంపుతున్నారు. కాగా, గోదావరి పరీవాహక ప్రాంతంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఎగువ నుంచి భారీ వరద వస్తుందని బేసిన్ పరిధిలోని రాష్ర్టాలను సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) అప్రమత్తం చేసింది.