చొప్పదండి, జూలై 8: కన్న కొడుకునే తండ్రి హతమార్చిన ఘటన చొప్పదండి మండల కేంద్రంలోని విజయనగరం వీధిలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చొప్పదండి పట్టణానికి చెందిన దూస వైకుంఠంకు ఇద్దరు కొడుకులు, కూతురు. వీరికి వివాహం చేశాడు. పెద్దకొడుకు వేరే ఊరిలో ఉంటుండగా, మెకానిక్‌గా పని చే స్తున్న చిన్న కొడుకు వెంకటేశ్ (32) తన భార్య దివ్య, రెండేండ్ల కొడుకుతో తల్లిదండ్రులతో ఉంటున్నాడు.
కొద్దిరోజులుగా మెకానిక్ పని మానేసి తండ్రితో కలిసి ఇంట్లోనే పవర్‌లూం పని చేస్తున్నాడు. ఇటీవల మద్యానికి బానిసయ్యాడు. దీంతో అతడి భార్య కొడుకుతో పుట్టింటికి వెళ్లింది. నిత్యం డబ్బుల కోసం తల్లిదండ్రులను వేధించేవాడు. దీంతో ఇంట్లో కొద్దిరోజులుగా నిత్యం గొడవలు జరుగుతున్నా యి. శుక్రవారం గొడవ ఎక్కువ కాగా, వైకుంఠం కత్తితో వెంకటేశ్ మెడను కోసి దారుణంగా హత్యచేశాడు. ఘటనా స్థలానికి సీఐ రవీందర్ చేరుకొని పంచనామా చేశారు. పో స్టుమార్టం కోసం మృతదేహాన్ని కరీంనగర్ దవాఖానకు తరలించారు. వైకుంఠంను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.