జమ్మికుంట రూరల్, జూలై 8: అగ్రిఇన్ పుట్ డీలర్లు వ్యవసాయ చట్టాలపై అవగాహన పెంచుకొని రైతులను చైతన్యవంతం చేయాలని కరీంనగర్ జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్ సూచించారు. పట్టణంలోని కేవీకేలో శుక్రవారం కృషివిజ్ఞాన కేంద్రం, ఆత్మ కరీంనగర్, మానేజ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో అగ్రిఇన్పుట్ డీలర్లకు వ్యవసాయ విస్తరణ డిప్లొమా సర్టిఫికెట్ కోర్స్ ఏర్పాటు చేశారు.
ముఖ్య అతిథులుగా జిల్లా వ్యవసాయాధికారితోపాటు కేవీకే ప్రధాన కార్యదర్శి పరిపాటి విజయ గోపాల్‌రెడ్డి, ఆత్మ కరీంనగర్ డైరెక్టర్ ప్రియదర్శిని, విశ్రాంత ఏడీఏ రామచందర్, కేవీకే ప్రధాన శాస్త్రవేత్త వెంకటేశ్వర్రావు, డిప్లొమా కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ నరేందర్ హాజరై డిప్లొమా కోర్సును ప్రారంభించారు. వ్యవసాయాధికారి శ్రీధర్ మాట్లాడుతూ, 48 వారాల పాటు తరగతులు, 8 క్షేత్ర సందర్శనలు నిర్వహిస్తామని తెలిపారు. అగ్రిఇన్పుట్ డీలర్లు, కేవీకే శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.