సైదాపూర్, జూలై 8: గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ పేర్కొన్నారు. మండలంలోని సోమారం గ్రామ పంచాయతీ పరిధిలో గల పసికపల్లి గ్రామంలో రూ. 16 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించి నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురైన గ్రామాలు నేడు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయన్నారు.
తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని, ఆర్థికాభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్‌రెడ్డి, వెన్నంపల్లి సింగిల్ విండో చైర్మన్ బిల్ల వెంకటరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సోమారపు రాజయ్య, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు చంద శ్రీనివాస్, సర్పంచులు పైడిమల్ల సుశీల-తిరుపతిగౌడ్, కాయిత రాములు, కొత్త రాజిరెడ్డి, రేగుల సుమలత-అశోక్, బర్మావత్ అక్షయాశ్రీనివాస్నాయక్, ఎంపీటీసీ ఏరుకొండ ఇందిరాసుధీర్, సింగిల్‌విండో వైస్ చైర్మన్ గుండేటి శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి చెలిమెల రాజేశ్వర్‌రెడ్డి, నాయకులు సారబుడ్ల రాజిరెడ్డి, పోలు ప్రవీణ్, సురేశ్‌గౌడ్, మోహన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, సంపత్‌రెడ్డి , తాళ్లపల్లి నరేశ్ తదితరులు పాల్గొన్నారు.