కరీంనగర్ రూరల్, జూలై 3: ప్రజా సమస్యల పరిష్కారమే సర్కారు ధ్యేయమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్‌లో పర్యటించారు. బీరప్ప ఆలయ ప్రహరీ, హాల్ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అనంతరం ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి స్థానికుల కోరిక మేరకు ఇంటి నంబర్లను తొలగించవద్దని ఎంపీవో జగన్మోహన్రెడ్డికి సూచించారు. అర్హులకు డబుల్బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. బీరప్ప ఆలయ ప్రహరీకి రూ.15 లక్షలు, పెద్దమ్మ ఆలయ ప్రహరీకి రూ. 15లక్షలు, ఆలయాల్లో హాళ్ల నిర్మాణానికి, వడ్డెర కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 20 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే పంచాయతీ నుంచి నిధులు కేటాయించాలని సర్పంచ్ పురుమల్ల శ్రీనివాస్‌ను కోరారు. అనంతరం మాట్లాడుతూ అందరి సహకారంతో గ్రామాభివృద్ధికి చర్యలు తీసుకుంటానని చెప్పారు.
కార్యక్రమంలో సర్పంచ్ పురుమల్ల శ్రీనివాస్, ఎంపీటీసీ ర్యాకం లక్ష్మీమోహన్, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, జడ్పీటీసీ పురుమల్ల లలిత, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ కాశెట్టి శ్రీనివాస్, వైస్ ఎంపీపీ వేల్పుల నారాయణ, కరీంనగర్ సింగిల్ విండో చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్‌రెడ్డి, ఎంపీటీసీ వెంగళదాసు శ్రీనివాస్, తిరుపతి, మోహన్, సుంకిశాల సంపత్‌రావు, వెంకన్న, శ్రీనివాస్, దాడి సుధాకర్, దాడి సంపత్, ఆరె శ్రీకాంత్, ఎరువ జోజిరెడ్డి, నేరెళ్ల ఆంజనేయులు, సిద్ధు, మద్దెల శ్రీనివాస్, గాదె శ్రీనివాస్, రవీందర్‌రెడ్డి, చింతల శ్రీనివాస్, సూర్యశేఖర్, కాల్వ మల్లేశం, కాల్వ అశోక్, గోష్కి శంకర్, ముత్యం శంకర్‌గౌడ్, జక్కినపల్లి శంకర్, ఏఈ రమణారెడ్డి, కార్యదర్శి శ్రీనివాస్, అశోక్, సాదవేణి రవీందర్, మల్లేశం, మహిళా నేత వైజయంతి పాల్గొన్నారు.