హుజూరాబాద్ రూరల్, జూలై 1: రాష్ట్రంలో ఇతర పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహించాలని రైతు ఉద్యమ నాయకుడు, ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు, కరీంనగర్ ఉమ్మడి జిల్లా రైతు సంఘాల అధ్యక్షుడు పెండ్యాల రాంరెడ్డి కోరారు. శుక్రవారం పెద్దపాపయ్యపల్లి శివారులోని సువర్ణావెంకటేశ్వర కల్యాణ మండపంలో రైతు ఉద్యమ మహాసభ సన్నాహక సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో వరికి బదులు ఆయిల్ పామ్, కంది, పెసర, మిర్చి, వేరుశనగ, మక, నువ్వు తదితర పంటల సాగును ప్రోత్సహించడంతోపాటు వాటికి మద్దతు ధర, మారెటింగ్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ నెల 3వ తేదీన నిర్వహించనున్న రైతు ఉద్యమ మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జీకే రైతుమిత్ర సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గూడూరి స్వామి రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందుపట్ల నర్సింహారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జున్నూతుల రాజిరెడ్డి, నాయకులు కంకణాల జనార్దన్ రెడ్డి, నల్లాల విజయారెడ్డి, కాసగోని కిరణ్ కుమార్, మామిడి తిరుపతి రెడ్డి, కందుల సమ్మిరెడ్డి, మెరుగు కొండల్ రెడ్డి, బండ లక్ష్మారెడ్డి. చెవుల కొమురయ్య, ఎం కుమార స్వామి, బెల్లంపల్లి సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీని కలిసిన నాయకులు
హుజూరాబాద్ టౌన్, జూలై 1: ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డిని శుక్రవారం జీకే రైతుమిత్ర సమన్వయ సమితి నాయకులు హుజూరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు రైతు ఉద్యమ మహాసభ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఎమ్మెల్సీని కలిసిన వారిలో జీకే రైతుమిత్ర సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గూడూరి స్వామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి చందుపట్ల నర్సింహారెడ్డి, ఉపాధ్యక్షురాలు కంకణాల సరోజన, హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు నల్లాల విజయారెడ్డి, నియోజకవర్గ బాధ్యులు బెల్లంపల్లి సమ్మిరెడ్డి, సలహాదారులు పొలాడి రామారావు, కంకణాల జనార్దన్‌రెడ్డి, కాసగోని కిరణ్‌కుమార్‌గౌడ్, సోషల్ మీడియా కన్వీనర్ లక్ష్మణమూర్తి ఉన్నారు.