ఓదెల, జూలై 8: ఆంధ్రా పాలనలో నిరాదరణకు గురైన దేవాలయాలకు స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్వవైభవం తెస్తున్నదని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఓదెల మల్లికార్జునస్వామి ఆలయ పాలక వర్గం ప్రమాణస్వీకార కార్యక్రమం శుక్రవారం ఏర్పాటు చేయగా, ఆయన హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతే నిధులు మంజూరు చేయించి మల్లన్న ఆలయంలో కోనేరుతో పాటు బంగారు పోచమ్మ, మధున పోచమ్మ ఆలయాల నిర్మాణాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రస్తుత పాలకవర్గం అంకితభావంతో కృషి చేయాలని, అందుకు తన సహకారం ఉంటుందని తెలిపారు. మల్లన్న యాదవుల ఇలవేల్పు కావడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి యాదవులకు ఆలయ చైర్మన్ పదవిని కేటాయించడంతోపాటు కమిటీలో తగిన ప్రాధాన్యత కల్పించినట్లు పేర్కొన్నారు. మల్లన్న ఆలయ కమిటీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన మేకల మల్లేశంయాదవ్ మాట్లాడుతూ, తనపై ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డికి ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, ఆయన అప్పజెప్పిన బాధ్యత మేరకు ఆలయ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. ఏడాది కాలంలో ఆలయ రూపురేఖలు మార్చి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఇందుకు ఎమ్మెల్యే, మంత్రులు, సీఎం సహకారం తీసుకుంటామన్నారు. యాదవులకు చైర్మన్ పదవి ఇవ్వడంపై కృతజ్ఞతలు తెలిపారు.
మల్లన్న ఆలయ చైర్మన్‌గా పెద్దపల్లికి చెందిన ప్రముఖ న్యాయవాది, యాదవ సంఘం జిల్లా నాయకుడు మేకల మల్లేశం యాదవ్, సభ్యులుగా ఆరెల్లి మొండయ్య (మాజీ సర్పంచ్), డాక్టర్ దాసరి రాజన్న (మాజీ సర్పంచ్), పరుపాటి నరేందర్‌రెడ్డి (మాజీ సర్పంచ్), కనికిరెడ్డి సతీశ్, మ్యాడగోని శ్రీకాంత్‌గౌడ్, చింతం వెంకటస్వామి, రౌతు స్వర్ణలత, మూడెత్తుల శ్రీనివాస్, బత్తుల రమేశ్, దుగ్యాల నర్సింగరావు, కర్రె కుమారస్వామి, ఎక్స్ అఫీషియో మెంబర్‌గా దేవాలయ ప్రధాన అర్చకుడు దూపం వీరభద్రయ్యతో ఉమ్మడి జిల్లా దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ ఆకునూరి చంద్రశేఖర్, ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఆలయ ఈవో సదయ్య ఎమ్మెల్యే సమక్షంలో ప్రమాణం చేయించారు. నూతన ధర్మకర్తలను అభిమానులు పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీపీ కునారపు రేణుకాదేవి, ఆకుల మహేందర్, బోడకుంట చినస్వామి, మండల సర్పంచుల ఫోరం, ఆర్బీఎస్ అధ్యక్షులు ఆళ్ల రాజిరెడ్డి, కావటి రాజుయాదవ్, సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల శ్రీనివాస్‌రెడ్డి, పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు, వివిధ కుల సంఘాలు, పార్టీల నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.