కరీంనగర్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : మునుపెన్నడూ లేని విధంగా ఎరువులకు కొరత ఏర్పడింది. ఓవైపు డిమాండ్ పెరగడం, మరోవైపు నిల్వలు పూర్తిగా తగ్గడంతో రైతులకు యూరియా అందే పరిస్థితి కనిపించడం లేదు. కరీంనగర్ జిల్లాలో మార్క్‌ఫెడ్, ప్రైవేట్, సొసైటీలు, హోల్‌సెల్ డీలర్లు ఇలా అంతటా కలుపుకొని కేవలం 729.886 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉన్నది. శనివారం పంపిణీ చేస్తే ఇవి కూడా పూర్తిగా అయిపోయే పరిస్థితి ఉన్నది. అంచనా ప్రకారం ఈ నెలలో 15,139 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ఇప్పటి వరకు వినియోగించిందిపోను ఇంకా 7,264 మెట్రిక్ టన్ను లు అవసరమని అధికారులు చెబుతున్నారు. సోమవారం ఒక ర్యాకు వచ్చే అవకాశముందని అంటున్నారు. కానీ, ఎంత వస్తుందనేది మాత్రం తెలియదు. అధికారుల అంచనా ప్రకారం వానకాలం సీజన్లో జిల్లాకు 43,254 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ఇప్పటి వరకు 25, 702 మెట్రిక్ టన్నులు వచ్చింది. అందులో శుక్రవారం వరకు 24,972.114 మెట్రిక్ టన్నులు వినియోగం జరిగింది.
ఇప్పుడు మార్కెట్లో కేవలం 729.886 మెట్రిక్ టన్నులు మాత్రమే ఉన్నది. మార్క్‌ఫెడ్‌లో 288.585, ప్రైవేట్‌లో 188.017, సొసైటీల్లో 229.284, హోల్‌సేల్‌లో 10, పలు కంపెనీల గోదాముల్లో 14 మెట్రిక్ టన్నులే ఉన్నది. అయితే, ఈ నెల 25 వరకు జిల్లాకు మరి కొంత యూరియా కేటాయించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నా, ఎంత వస్తుందనేది మాత్రం ఎవరూ చెప్పడం లేదు. ఒక వేళ వస్తే 2 వేల మెట్రిక్ టన్నులకు మించి వచ్చే అవకాశం లేదని తెలుస్తున్నది. అధికారులు చెబుతున్నట్టు వచ్చినా ఒకట్రెండు రోజులకే సరిపోతుంది. ము న్ముందు యూ రియా డిమాండ్ మరింత పెరగనున్న ది. ఈ నెలలో ఇంకా 7,264 మెట్రిక్ ట న్ను లు, వచ్చే నెలలో మరో 8,651 మెట్రిక్ టన్నులు అవసరం ఉంటుంది. వరి, మ క్క, పత్తి పంటలకు ఈ నెలలోనే ఎక్కువ శాతం యూరియా వినియో గం జరుగుతుంది. ఈ సమయంలో యూరియా దొరకకపోతే దిగుబడిపై ప్రభావం పడి, తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంటుంది. ఈ పరిస్థితుల్లోనే యూ రియా నిల్వలు అడుగంటిన విషయం తెలుసుకుంటున్న అన్నదాతల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది.