రుద్రంగి, జూన్ 20: రాష్ట్ర ప్రభుత్వం గిరిజన బాలికల విద్య కు భరోసా కల్పిస్తున్నదని కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నా రు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం ఆయన గైదిగుట్టతండాలో కేజీ టూ పీజీ గిరిజన బాలికల గురుకుల పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించి, మాట్లాడారు. గైదిగుట్టతండా గ్రామంలో రూ.6.50కోట్లతో కేజీ టూ పీజీ బాలికల గురుకుల పాఠశాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు.
పాఠశాల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. నీటి కొరత, విద్యు త్, రహదారి సమస్యలు ఉండగా, సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం చూపుతామని తెలిపారు. నిర్మాణ పనుల్లో జాప్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల డీఈ అంజనీకుమార్, వైస్ ఎంపీపీ పీసరి భూమయ్య, తహసీల్దార్ శ్రవణ్, ఎంపీడీవో శంకర్ తదితరులు ఉన్నారు.
చందుర్తి, జూన్ 20: లింగంపేటలో ఏర్పాటు చేయనున్న మోడల్ బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదే శించారు. సోమవారం ఆయన గ్రామంలోని పల్లె ప్రకృతి, బృహ త్ ప్రకృతి వనాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు లింగంపేటలో మోడల్ బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ మోడల్ బృహత్ పల్లె ప్రకృతి వనంలో గ్రామ స్తులకు ఆహ్లాదాన్ని పంచేవిధంగా అన్ని రకాల పూల మొక్కలు నాటాలని సూచించారు. అలాగే పల్లె ప్రకృతి వనానికి రహదారి సమస్యను పరిష్కరించాలని తహసీల్దార్ మాజీద్‌ను ఫోన్లో ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో గౌతమ్‌రెడ్డి, డీఆర్డీ వో మదన్మోహన్, టీఆర్ఎస్ నాయకుడు డప్పుల అశోక్, ఎం పీడీవో రవీందర్, ఎంపీవో ప్రదీప్, ఏపీవో రాజయ్య, పంచాయ తీ కార్యదర్శి, తదితరులు పాల్గొన్నారు.