మానకొండూర్, మే 23: పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజూ ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్ష జరిగింది. మండలవ్యాప్తంగా నాలుగు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మానకొండూర్ బాలుర ఉన్నతపాఠశాలలో 131 మందికి 131 మంది, పోచంపల్లిలో 165 మంది విద్యార్థులకు 162, సోషల్ వెల్ఫేర్ స్కూల్ దేవంపల్లిలో 160కి 158, కొండపల్కలలో 86 మందికి మొత్తం మంది విద్యార్థులు పరీక్షలు రాశారని ఎంఈవో మధుసూదనాచారి తెలిపారు. మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల సెంటర్‌ను కరీంనగర్ రూరల్ ఏసీపీ కరుణాకర్‌రావు, జమ్మికుంట ఎంఈవో తనిఖీ చేశారు.
చిగురుమామిడి, మే 23: పదో తరగతి పరీక్షలు మొదటిరోజు ప్రశాంతంగా జరిగినట్లు ఎంఈవో విజయలక్ష్మి తెలిపారు. చిగురుమామిడి ప్రభుత్వ జూనియర్ కళాశాలతోపాటు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఇందుర్తి లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పా రు. 291 మంది విద్యార్థులు రాయాల్సి ఉండ గా, ఒకరు గైర్హాజరయ్యారని పేరొన్నారు. కాగా పరీక్షా కేంద్రాల వద్ద ఎస్ఐ దాస సుధాకర్ నేతృత్వంలో 144 సెక్షన్ అమలు చేశారు.
శంకరపట్నం, మే 23: మండలంలోని కేశవప ట్నం, మొలంగూర్, తాడికల్లోని మూడు పరీక్షా కేంద్రాల్లో 324 మంది విద్యార్థులు పరీక్షలు రా యగా, కేశవపట్నం, మొలంగూర్ సెంటర్లలో ఒక్కొక్కరు చొప్పున గైర్హాజరైనట్లు ఆయా పరీక్షా కేంద్రాల సీఎస్‌లు రోజారమణి, ఆర్ శ్రీనివాస్ తెలిపారు. తాడికల్ పరీక్షా కేంద్రాన్ని తహసీల్దార్ గూడూరి శ్రీనివాస్‌రావు సందర్శించారు.
తిమ్మాపూర్ రూరల్, మే23: మండల వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మండలంలోని నుస్తులాపూర్, తిమ్మాపూర్‌లోని మోడల్ స్కూల్, మైనార్టీ గురుకులం, పర్లపల్లి, ఎల్ఎండీ జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన 5 సెంటర్లలో పరీక్షలు నిర్వహించగా 793మంది విద్యార్థులు హాజరుకాగా. ఆరుగురు గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి ఎల్ఎండీ ఎస్ఐ ప్రమోద్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.