కొత్తపల్లి, ఆగస్టు 26 : ఉరుకుల పరుగులు జీవితంలో మానసిక ప్రశాంతత, ఆయురారోగ్యాల సాధనకు ఏకైక మార్గం యోగా. అందుకే దీనిపై ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి పెరుగుతున్నది. స్పోర్ట్స్ కోటాలో యోగాను చేర్చడంతో మరింత క్రేజీ నెలకొన్నది. ఆరోగ్యం, ఉల్లాసం కోసం పెద్దలు సాధన చేస్తుండగా.. మానసిక పరిపక్వతతోపాటు వివిధ కోర్సులు, ఉద్యోగాల్లో రిజర్వేషన్‌కు అవకాశముండడంతో పిల్లలను ప్రోత్సహించడం కనిపిస్తున్నది.
తెలంగాణ యోగా అసోసియేషన్ సౌజన్యంతో కరీంనగర్ జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యం లో శుక్రవారం అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి యోగాసన స్పోర్ట్స్ పోటీలకు అనూహ్య స్పందన వచ్చింది. ఇది పెరిగిన ఆసక్తిని తెలియజేస్తున్నది. జిల్లా నుంచి 300 మంది బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొన్నారు. యో గా విన్యాసాలు చేసి అబ్బురపరిచారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్‌లాల్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
సాధారణ బాలబాలికలు 90 శాతం నుంచి 95 ఫలితాలు సాధిస్తే, యోగా సాధకులు వందశాతం మెరుగైన ఫలితాలు సాధిస్తారని తెలిపారు. నేటి బాల బాలికలు, ముఖ్యంగా యువతీయువకులు ఏకాగ్రత తో సాధన చేస్తే ఆరోగ్య పరిరక్షణతో పాటు మానసిక పరిపక్వత కలిగి నిజజీవితంలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారన్నారు. జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షుడు సర్దార్ రవీందర్‌సింగ్ మాట్లాడుతూ, యోగాకు స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ కల్పించేందుకు ప్రభుత్వం, తాను ఎంతో కృషి చేశామన్నారు.
ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు తు మ్మల రమేశ్ రెడ్డి, ఎస్జీఎఫ్ కార్యదర్శి కనకం స మ్మయ్య, పేట అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా యో గా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు క న్న కృష్ణ, కార్యదర్శి నాగిరెడ్డి సిద్దారెడ్డి, కోచ్‌లు వీ కిష్టయ్య, జీ రామకృష్ణ, స్వరూపచారి, మల్లిక, ఆనంద్‌కిశోర్, కోటేశ్వర్, ప్రవీణ, రాజశేఖర్ పాల్గొన్నారు.