హుజూరాబాద్‌టౌన్/ఇల్లందకుంట/జమ్మికుంట రూరల్, ఆగస్టు 26: పెద్దపల్లిలో ఈనెల 29న నిర్వహించే బహిరంగ సభకు సీఎం కేసీఆర్ హాజరవుతారని, నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. హుజూరాబాద్ పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయం, ఇల్లందకుంటలోని శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణ మండపం, జమ్మికుంట పట్టణంలోని స్వాతి గార్డెన్స్‌లో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు.
కాగా, ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీతో పాటు జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ హాజరయ్యారు. ఆయా చోట్ల ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని, నియోజకవర్గం నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అండగా నిలువాలన్నారు. ప్రతి గ్రామంలో సర్పంచ్, ఎంపీటీసీ, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు సమన్వయంతో పనిచేసి ప్రజలను తరలించాలని సూచించారు. మన ఇంట్లో జరిగే శుభకార్యాన్ని ఎంత బాధ్యతతో చేస్తామో, అంతే బాధ్యతతో బహిరంగ సభకు ప్రజలను తరలించాలని పిలుపునిచ్చారు.
నియోజకవర్గం నుంచి 25 వేల మందిని సభకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. హుజూరాబాద్‌లో మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, ఎంపీపీ ఇరుమల్ల రాణి, జడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ బర్మావత్ రమ-యాదగిరినాయక్, పీఏసీఎస్ చైర్మన్ ఎడవెల్లి కొండల్‌రెడ్డి, ఆర్బీఎస్ మండల కన్వీనర్ దాసరి రమణారెడ్డి, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, సంగెం ఐలయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కన్నెబోయిన శ్రీనివాస్‌యాదవ్, కౌన్సిలర్లు, ఇల్లందకుంటలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ కందాల కొమురెల్లి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్యనారాయణరావు, జమ్మికుంట పట్టణంలో మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు, జడ్పీటీసీ డాక్టర్ శ్రీరాంశ్యాం, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మాదిరెడ్డి వెంకట్‌రెడ్డి, సహకార సంఘం చైర్మన్ పొనగంటి సంపత్, మాజీ సర్పంచ్ పొనగంటి మల్లయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్యనారాయణరావు, కౌన్సిలర్లు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, ఆర్బీఎస్ మండల కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు.