స్వత్రంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం వాడవాడలా ముగ్గుల పోటీలు నిర్వహిం చారు. అతివలు ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశభక్తిని చాటేలా రంగవల్లులను తీర్చిదిద్దారు. విజేతలను ప్రజాప్రతినిధులు, అధికారులు అభినందించి బహుమతులు ప్రదానం చేశారు.
వేములవాడ ఆగస్టు 20: స్వతంత్ర వజ్రోత్సవ వే డుకల్లో భాగంగా వేములవాడ పురపాలకసంఘం ఆధ్వర్యంలో సినారె కళామందిరంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ శ్యామ్‌సుందర్‌రావు మాట్లాడుతూ ముగ్గుల పోటీల్లో 26మంది మెప్మా సిబ్బందితో పాటు మ హిళలు పాల్గొన్నారని చెప్పారు. అందరికీ బహుమతులు అందజేశామన్నారు. టెక్నికల్ ఏఈ శ్రావణ్‌కుమార్, మెప్మా సిబ్బంది తదితరులు ఉన్నారు.
వేములవాడ రూరల్, ఆగస్టు 20: వేములవాడ మండల పరిషత్ కార్యాలయంతో పాటు మ ల్లారం, నూకలమర్రి, నాగయ్యపల్లిల్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. మండలపరిషత్‌లో ఎం పీపీ బూర వజ్రమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని రంగవల్లులను తీర్చిదిద్దారు. అనంతరం విజేతలకు బహుమ తు లను అందజేశారు. ఇందులో జడ్పీటీసీ మ్యాకల రవి, వైస్ ఎంపీపీ ఆర్సీరావు, ఎంపీడీ వో శ్రీధర్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఊరడి రాంరెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు వనపర్తి దేవరాజు, సర్పంచులు వెంకటరమణ, నేతలు మల్లేశం, మహేశ్, స్వామి, శ్రీనివాస్, బాబు పాల్గొన్నారు.
కోనరావుపేట, అగస్టు 20: మండలంలోని మా మిడిపల్లి పాలకవర్గం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ లు నిర్వహించారు. పెద్దసంఖ్యలో మహి ళలు తరలివచ్చి ముగ్గులు వేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కొక్కుల భారత, ఎంపీటీసీ ప్రభాకర్ రావు, ఉపసర్పంచ్ రాంరెడ్డి,వార్డు సభ్యులు ఎల్లా రెడ్డి, కార్యదర్శి అజీజ్, నాయకులు నర్సయ్య, సాగర్, కుమార్, తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 20: మండలంలోని బొప్పాపూర్‌లో ఏఎంసీ చైర్మన్ కొండ రమేశ్‌గౌడ్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు కొండాపురం బాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. అలాగే హరిదాస్‌నగర్‌లో జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేసి అభినందించారు.
చందుర్తి, ఆగస్టు 20: మండలంలోని నర్సిం గాపూర్లో నిర్వహించిన ముగ్గుల పోటీలను ఎం పీపీ బైరగోని లావణ్య ప్రారంభించారు. అనంతరం గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ రాపెల్లి గంగాధర్, ఉపసర్పంచ్ శ్రీనివాస్, వార్డు సభ్యు లు నరేశ్, దేవేంద్ర, పంచాయతీ కార్యదర్శి ప్రసాద్, గ్రామస్తులు పాల్గొన్నారు.
రుద్రంగి, ఆగస్టు 20: రుద్రంగి మండల కేంద్రం తో పాటు అన్ని గ్రామాల్లో ముగ్గుల పోటీలు నిర్వ హించారు. రుద్రంగిలో జడ్పీటీసీ గట్ల మీనయ్య, సర్పంచ్ తర్రె ప్రభలత, అధికారులు మహిళలతో ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలోఎంపీడీవో శంకర్, ప్రభుత్వ పా ఠశాల హెచ్ఎం అంబటి శంకర్, ఏపీఎం రాజు, నాయకులు తర్రె మనోహర్, ఆకుల గంగారాం, బండారి నర్సయ్య, గొళ్లెం నర్సింగ్ ఉన్నారు.
బోయినపల్లి, ఆగస్టు 20: కోరెం, వరదవెల్లి, గుండన్నపల్లి, ఆనంతపల్లి, దుండ్రపల్లి, మల్లా పూర్, మర్లపేట గ్రామాల్లో శనివారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, స్వాత్రంత్య్ర దినోత్సవంపై వేసిన ముగ్గులు ప్రజలను ఆకట్టు కోగా విజేతలకు ఎంపీటీసీలు సర్పంచ్‌లు బహుమతులు ప్రదానం చేశారు. ఎంపీటీసీ డబ్బు మమత, వార్డు సభ్యు లు, సర్పంచ్‌లు కొప్పుల లక్ష్మి, ఆరేపల్లి లత, వం గపల్లి సత్యానారాయణరెడ్డి, ఇల్లందుల శంకర్, సుకన్య, కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు, మహిళ సంఘాల ప్రతినిధులున్నారు.
ఇల్లంతకుంట, అగస్టు 20 : ఇల్లంతకుంటలోముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ ఉపేందర్ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో జోగం రాజు, సర్పంచ్ కూనబోయిన భాగ్యలక్ష్మి, ఎంపీటీసీ ఒగ్గు నర్సయ్య, ఎస్ఐ మామిడి మహేందర్, ఏపీఎం వాణిశ్రీ మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.