వేములవాడ టౌన్, జూలై 27: పట్టణంలోని రేణుకామాత గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహిళలు బుధవారం బద్ది పోచమ్మ అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పించారు. డప్పుచప్పుళ్ల మధ్య మహిళలు ఇంటికో బోనంతో ఆలయానికి వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఇక్కడ టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్‌రెడ్డి, గౌడ సంఘం అధ్యక్షుడు వెంగళ అంజన్న, ఉపాధ్యక్షులు రమేశ్, వెంగళ శ్రీకాంత్‌గౌడ్, బుర్ర శ్రీనివాస్, పొన్నం శ్రీధర్, గొడిశెల రాజశేఖర్, రవిచంద్ర, భూమేశ్ తదితరులు ఉన్నారు.
చందుర్తి, జూలై 27: సనుగుల గ్రామంలో బుధవారం విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు నిర్వహించారు. మహిళలు నెత్తిన బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధా న కార్యదర్శి సనుగుల సత్యం, మండలాధ్యక్షుడు రాజు పాల్గొని పూజలు చేశారు. ఇక్కడ నేతలు హన్మాండ్లు, గంగయ్య, ఎల్ల య్య, దుర్గయ్య, రాజు, శ్రీనివాస్, అనిల్, లచ్చయ్య ఉన్నారు.
బోయినపల్లి, జూలై 27: మండల కేంద్రంలో బుధవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల పండుగను జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మహిళలు ఇంటికో బోనంతో డప్పుచప్పుళ్లు, బైండ్లోడ్ల ఆటపాటల మధ్య ఆలయానికి వెళ్లారు. పాడిపంట.. పిల్లాపాపలను సల్లంగ సూడాలని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక్కడ గౌడ సంఘం రాష్ట్ర నాయకుడు, సీనియర్ జర్నలిస్ట్ నల్లగొండ వేణుగోపాల్‌గౌడ్, సర్పంచ్ గుంటి లతశ్రీ, ఎంపీటీసీ బుచ్చమ్మ, నాయకులు ఉన్నారు.