వెయిసెన్హాస్ (జర్మనీ): చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ ఖాతాలో మరో ప్రతిష్టాత్మక టైటిల్ చేరింది. ఫిడే ఆధ్వర్యంలో జర్మనీ ఆతిథ్యమిచ్చిన ఫ్రీస్టయిల్ చెస్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో అతడు విజేతగా నిలిచాడు. సోమవారం ఇక్కడ జరిగిన చివరిదైన నిర్ణయాత్మక నాలుగో గేమ్‌లో డ్రా చేసుకుంటే టైటిల్ గెలిచే అవకాశమున్న ఈ నార్వే దిగ్గజం..
అమెరికా ఆటగాడు ఫాబియానో కరువానాతో మ్యాచ్‌ను డ్రాగా ముగించాడు. ఫ్రీస్టయిల్లో కార్ల్‌సన్‌కు ఇదే మొదటి వరల్డ్ చాంపియన్ టైటిల్. గతంలో క్లాసికల్ విభాగంలో 5, ర్యాపిడ్‌లో 6, బ్లిట్జ్‌లో 9 టైటిల్స్ గెలిచిన అతడికి మొత్తంగా ఇది 21వ వరల్డ్ చాంపియన్ టైటిల్ కావడం గమనార్హం.