తిరువనంతపురం: పాలిష్ చేసిన తెల్ల బియ్యం త్వరలో ఆరోగ్యకరమైన మార్పులను సంతరించుకోనున్నది. సీఎస్ఐఆర్-ఎస్ఐఐఎస్టీ రూపొందించిన బియ్యం ైగ్లెసెమిక్ ప్రభావాన్ని తగ్గించి ప్రొటీన్లు, మైక్రోన్యూట్రియంట్లతో కూడిన ఆహారంగా ఆరోగ్యాన్ని అందచేయనున్నది. సీఎస్ఐఆర్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్‌డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ(సీఎస్ఐఆర్-ఎన్ఐఐఎస్టీ) టెక్నాలజీ బదిలీ ఉత్సవాన్ని నిర్వహించడానికి సమాయత్తమవుతున్నాయి.
న్యూఢిల్లీలోని సీఎస్ఐఆర్ ప్రధాన కార్యాలయంలో ఫిబ్రవరి 18న సీఎస్ఐఆర్-ఎన్ఐఐఎస్టీ టెక్ కనెక్ట్:ఫ్రమ్ ల్యాబ్ టు మార్కెట్ కార్యక్రమం జరుగనున్నది. దేశీయంగా అభివృద్ధి చేసిన అనేక సాంకేతికతలను పరిశ్రమ భాగస్వాములకు అధికారికంగా బదిలీ చేసేందుకు ఈ కార్యక్రమం జరుగుతున్నది. తక్కువ ైగ్లెసెమిక్ ఇండెక్స్, ప్రొటీన్-మైక్రోన్యూట్రియంట్స్తో కూడిన డిజైనర్ బియ్యం విడుదల, బదిలీకి ఈ వేడుక వేదిక అవుతుందని సీఎస్ఐఆర్-ఎన్ఐఐఎస్టీ తెలిపాయి.
అధిక పోషకాలు, తక్కువ ైగ్లెసెమిక్ స్పందన, అదనంగా చేర్చిన ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బీ12 వంటి న్యూట్రియంట్స్ ఈ బియ్యంలో ఉంటాయని ప్రకటన పేర్కొన్నది. టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్, ఎస్ఎస్ సోల్ ఫుడ్స్‌కు ఈ టెక్సాలజీ లైసెన్సు ఇవ్వనున్నారు. ఈ బియ్యాన్ని రూపొందించిన సీఎస్ఐఆర్-ఎన్ఐఐఎస్టీ డైరెక్టర్ ఆనంద రామకృష్ణన్‌కు టాటా ట్రాన్స్ఫార్మేషన్ ప్రైజ్-2024 లభించినట్లు పీటీఐ తెలిపింది.