చేర్యాల, ఫిబ్రవరి 16 : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టాల్లో ఒకటైన పెద్దపట్నం కార్యక్రమాన్ని ఒగ్గు పూజారుల నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. శివరాత్రి సందర్భంగా ఆదివారం లింగోద్భవ కాలం రాత్రి 12 గంటలకు మల్లికార్జునస్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు.
అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను అర్చకులు రాజగోపురం, రాతిగీరలు ప్రాంతాల్లో ఊరేగించి ఆలయంలోకి తీసుకువెళ్లారు. ఒగ్గు పూజారులు 42 వరుసలతో పెద్దపట్నం తయారుచేశారు. పట్నం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి పట్నం దాటారు.