బోయినపల్లి, జూలై 27: ఆరుగాలం శ్రమించి పంటలు పండించే కర్షకులకు అండగా ఉండాలని బోయినపల్లి మార్కెట్ కమిటీ పాలకవర్గానికి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సూచించారు. మండలకేంద్రంలో బుధవారం నిర్వహించిన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన హాజరయ్యారు. చైర్మన్ లెంకల సత్యనారాయణ, వైస్ చైర్మన్ చిక్కాల సుధాకర్‌రావు, డైరెక్టర్లు జంగ సత్తయ్య, కన్నం విద్యాసాగర్, జంపుక మాధవి, చిందం వేణుగోపాల్, కస్తూరి బాపురెడ్డి, కొప్పుల మల్లేశం, గుడి శ్రీనివాసరెడ్డి, బొజ్జ లక్ష్మీరాజం, ఈడ్గు అంజయ్య, పోలె కొమురయ్యను అభినందించారు.
ఎమ్మెల్యేతోపాటు టీఆర్ఎస్ రాష్ట్ర నేతలు జోగినపల్లి రవీందర్రావు, జోగినపల్లి ప్రేమ్‌సాగర్‌రావు, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ముదుగంటి సురేందర్‌రెడ్డి పూలమాలలు వేసి సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి అని, ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి కృషి చేస్తున్నదని చెప్పారు. పాలకవర్గం బాధ్యాతయుతంగా పనిచేసి సర్కారుకు మంచిపేరు తీసుకురావాలని సూ చించారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నేతలు చెన్నాడి అమిత్‌కుమార్, అనుముల భా స్కర్, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ కొనుకటి లచ్చిరెడ్డి, సెస్ డైరెక్టర్ మేడుదుల మల్లేశం, వైస్ ఎంపీపీ కొనుకటి నాగ య్య, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యుడు కొట్టెపల్లి సుధాకర్, కొండగట్టు ఆలయ కమిటీ సభ్యు డు ముద్దం రవి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, సర్పంచ్‌లు గుంటి లతశ్రీ, బూ ర్గుల నందయ్య, ఒంటేల గోపాల్‌రెడ్డి, ఎంపీటీసీలు సంబ బుచ్చమ్మ, ఈడ్గు రాజేశ్వరి, ఐరెడ్డి గీతా, కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ అజ్జు, టీఆర్ఎస్ మహి ళా అధ్యక్షురాలు నాగుల వసంత ఉన్నారు.