Karimnagar | కమాన్ చౌరస్తా, మార్చి 16 : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రామ్ నగర్ రమా సహిత సత్యనారాయణ స్వామి, అభయాంజనేయ స్వామి దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లను ఘనంగా సన్మానించారు. ఆలయ అన్నదాన భవనములో ఏర్పాట చేసిన ఈ కార్యక్రమంలో 46 వ డివిజన్ కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్, 47 వ డివిజన్ కార్పొరేటర్ గాజ రమ శివరామ్ కార్పొరేటర్లకు ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు స్వాగతం పలికి, పూలమాల వేసి, స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు నూతన కార్పొరేటర్లకు శుభాకాంక్షలు తెలుపుతూ దేవాలయ అభివృద్ధికి సంబంధించిన పలు విన్నపాలను తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాట్లాడుతూ తమపై నమ్మకంతో గెలిపించిన ప్రజలకు, గౌరవించిన ఆలయ కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. దేవాలయాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా అన్ని వసతులతో కూడిన ఆదర్శ క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ మల్లికార్జున రాజేందర్ నేతృత్వంలో కమిటీ సభ్యుల ఏకగ్రీవ తీర్మానంతో 47 వ డివిజన్ కార్పొరేటర్ గాజ రమా శివరామ్ ను దేవాలయ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించుకున్నారు.
ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ కమిటీ కార్యనిర్వాహక సభ్యులు కన్నెబోయిన ఓదెలు, పాత శేఖర్, కల్వకుంట్ల ప్రమోద్ కుమార్, దారం చంద్రయ్య, సుధగోని కొండయ్య గౌడ్, బొబ్బిలి శంకర్, రంగు చెన్నయ్య గౌడ్, ఏ. కిరణ్ కుమార్, నాగసముద్రం వాసరయ్య, వేదాంతం సత్యనారాయణ, బండిపెల్లి మారుతి, బొల్లబత్తిని రవీందర్, పురేళ్ళ మహేందర్, సుధగోని సర్వయ్య గౌడ్, బొబ్బిలి వంశీ అర్చకులు బహిరి అనిల్ కుమార్, తిరునహరి ప్రవీణ్ కుమార్, భక్తులు, డివిజన్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.