కరీంనగర్ విద్యానగర్, జూన్ 15 : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖాన(జీజీహెచ్)లో కలెక్టర్ పమేలా సత్పతికి ఆదివారం మెడికల్ సూపరింటెండెంట్ గుండా వీరారెడ్డి ఆధ్వర్యంలో వైద్యులు శస్త్రచికిత్స చేశారు. కొన్ని సంవత్సరాల నుంచి తీవ్ర తలవొప్పి, ముకు దిబ్బడ, నాసిక అడ్డంకి, సైనసైటిస్, శ్వాస ఇబ్బందితో బాధడుతున్న కలెక్టర్ వివిధ ఈఎన్టీ వైద్యులు రాసి ఇచ్చిన మందులను తాతాలికంగా వినియోగిస్తూ వచ్చారు.
ఈ క్రమంలో కరీంనగర్ ప్రభుత్వ వైద్యులపై నమ్మకంతో ప్రభుత్వ దవాఖానలో అత్యవసర ‘ఎండోసోపీ నేసలు సర్జరీ, సెప్టో ప్లాస్టిక్టినీ’ని చేయించుకున్నారు. ఇప్పటివరకు ఉన్నతాధికారులు, వారి కుటుంబ సభ్యుల డెలివరీలు మాత్రమే ప్రభుత్వ దవాఖానలో జరిగాయని, మొట్టమొదటిసారిగా కలెక్టర్ సర్జరీ చేసుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారని సూపరింటెండెంట్ వీరారెడ్డి కొనియాడారు. ప్రతి ఒకరూ ప్రభుత్వ దవాఖాన వైద్య సేవలు నియోగించుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు. శస్త్ర చికిత్స చేసిన వారిలో ఈఎన్టీ సర్జన్స్ ఎల్ రవికాంత్, సందీప్, మధుమిత, మత్తు వైద్యులు శాంతన్ కుమార్, చంద్రశేఖర్, సతీశ్, సంగీత, ఫిజీషియన్ నవీన, నర్సింగ్ ఆఫీసర్స్ మాధవి, మమత, సుజాత ఉన్నారు.
కలెక్టర్కు వైద్యారోగ్య శాఖ మంత్రి అభినందన
ప్రభుత్వ దవాఖానలో శస్త్రచికిత్స చేసుకుని స్ఫూర్తిగా నిలిచిన కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతిని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు. కలెక్టర్ నిర్ణయం ఆమె చురుకైన న్యాయకత్వాన్ని బలోపేతం చేస్తుందని తెలిపారు. సంక్లిష్టమైన ప్రక్రియను విజయవంతంగా నిర్వహించినందుకు వైద్యులను అభినందించారు. కలెక్టర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.