Npdcl | ముకరంపుర, మే 14: ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) సీఎండీ వరుణ్ రెడ్డి ఏప్రిల్ నెలకు గాను పనితీరులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులు, సిబ్బందికి ర్యాంకులు ప్రకటించారు. నిర్దేశిత పారామీటర్ల ఆధారంగా లక్ష్యాలను పూర్తి చేయడంతో కరీంనగర్ సర్కిల్ డిస్కం స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిందని ఎస్ఈ మేక రమేష్ బాబు తెలిపారు. క్షేత్ర స్థాయిలో వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు ఉద్యోగుల మధ్య స్నేహపూర్వక పోటీ తత్వాన్ని పెంచే లక్ష్యంతోనే అధికారులు, సిబ్బందికి ”బెస్ట్ పెర్ఫార్ మెన్స్ ఆఫ్ ది మంత్” పేరిట సీఎండీ ర్యాంకులు ప్రకటిస్తున్నారని పేర్కొన్నారు.
ఏప్రిల్ నెలకు గాను డిస్కం స్థాయిలో కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ మేక రమేష్ బాబు మొదటి స్థానంలో నిలిచారు. అలాగే కరీంనగర్ టౌన్ డీఈ రాజం రెండో స్థానం, హుజూరాబాద్ డీఈ ఎస్ లక్ష్మారెడ్డి మూడో స్థానంలో నిలిచారు. ఉమ్మడి కరీంనగర్ సర్కిల్ స్థాయిలో కరీంనగర్ రూరల్ డీఈ ఎం తిరుపతి మొదటి ర్యాంకు సాధించారు. ఏడీఈ ల విభాగంలో (అర్బన్)లో కరీంనగర్ టౌన్-2 ఏడీఈ ఎం లావణ్య డిస్కం స్థాయిలో మొదటి, రూరల్ విభాగంలో హుజురాబాద్ ఏడీఈ పీ శ్రీనివాస్ రెండు, కరీంనగర్ రూరల్ ఏడీఈ జీ రఘు మూడు, అలుగునూరు ఏడీఈ జీ శ్రీనివాస్ నాలుగో ర్యాంక్ పొందారు.
ఏఈల విభాగంలో నుస్తులాపూర్ సెక్షన్ ఏఈ రజిత డిస్కం స్థాయిలో ఆరో ర్యాంకు సాధించగా ఆముదాలపల్లి సెక్షన్ ఏఈ రఘు తొమ్మిది, ఆచంపల్లి ఏఈ రాంమోహన్ పదో ర్యాంకు సాధించారు. అర్బన్ విభాగంలో హుజురాబాద్ టౌన్ ఏఈ శ్రీనివాస్ డిస్కం లెవెల్లో రెండు, కరీంనగర్ టౌన్-7 ఏఈ మల్లయ్య మూడు, రూరల్ ఈస్ట్ సెక్షన్ ఏఈ సవాయి నాయక్ నాలుగో స్థానంలో నిలిచారు.
ఉమ్మడి కరీంనగర్ సర్కిల్ స్థాయిలో కరీంనగర్ టౌన్-4 ఏఈ భూమయ్య మొదటి, తాడికల్ సెక్షన్ ఏఈ సంపత్ రెడ్డి రెండో ర్యాంకు సాధించారని ఎస్ఈ తెలిపారు. డిస్కం స్థాయిలో కరీంనగర్ సర్కిల్ మొదటి ర్యాంక్ సాధించడంతో సంతోషం వ్యక్తం చేస్తూ డీఈ కే ఉపేందర్, ఎస్ఏవో రాజేంద్రప్రసాద్, పీవో బీ చంద్రయ్య, ఏడీఈ లావణ్య, మునీందర్, రమేష్ తదితరులు ఎస్ ఈ రమేష్ బాబుకు పుష్పచ్ఛం, పూల మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.